Manmohan singh rules out resignation of union law minister

law minister resignation ruled out, prime minister manmohan singh, law minister aswini kumar, coalgate scam, 5 year old rape case

manmohan singh rules out resignation of union law minister

రాజీనామా? చాల్లే ఊరుకోండి !

Posted: 04/27/2013 02:56 PM IST
Manmohan singh rules out resignation of union law minister

ఏ గొడవ జరిగినా ముందు రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షాలు పట్టుబట్టటం, రాజీనామా చెయ్యటానికా పదవుల్లోకి వచ్చింది,  ఏమైనా కానీ రాజీనామా చెయ్యం అంటూ నేతలు సీటుని గట్టిగా పట్టుకోవటం పూర్వంలో లేనంతగా ప్రబలిపోయింది.  2జి కుంభకోణంలో చిదంబరం రాజీనామాను ప్రతిపక్షాలు కోరగా, లేదు లేదు ఆయన చాలా మంచివాడు అంటూ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చిదంబరాన్ని వెనకేసుకొచ్చారు. 

బొగ్గు కేటాయింపుల కుంభకోణంలో దర్యాప్తు చేస్తున్న సిబిఐ ని ప్రభావితం చేసి ప్రధానమంత్రిని అందులోంచి తప్పించినందుకు ప్రధానమంత్రి రాజీనామా చెయ్యాలని మరోసారి ప్రతిపక్షం పట్టుబట్టగా, అది సరికాదంటూ యుపిఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, తదితర కాంగ్రెస్ మంత్రులంతా ప్రకటించారు.

ప్రధాన మంత్రిని ఆ కుంభకోణంలోంచి తప్పించటం కోసం న్యాయశాఖా మంత్రి అశ్వని కుమార్ పలుమార్లు సిబిఐ అధికారులతో మాట్లాడి వాళ్ళని ప్రభావితులను చేసారంటూ భారతీయ జనతా పార్టీ అభియోగాన్ని మోపగా, తాజాగా సిబిఐ ఇచ్చిన వాంగ్మూలంలో, సిబిఐ నివేదికను న్యాయశాఖా మంత్రి ముందుగా చూసారంటూ సిబిఐ ఒప్పుకుంది.  దీనిమీద ఆందోళన చేస్తూ న్యాయశాఖా మంత్రి రాజీనామా చెయ్యాలంటూ ప్రతిపక్షాలు దుమారం లేపగా, అది జరగని పనని ప్రధాన మంత్రి మీడియా ముఖంగా తెలియజేసారు.  తను తప్పు చేసానని కానీ, తనను కాపాడటానికి న్యాయశాఖా మంత్రి కృషి చేసారని కాని ప్రతిపక్షం చెప్తున్న మాటలను ప్రధాన మంత్రి ఖండించారే తప్ప అందుకు సంజాయిషీ ఏమీ ఇచ్చుకోలేదు, వివరణాత్మకంగా ఏ వివరాన్నీతెలియజేయలేదు..  ప్రతిపక్షాలు ఇలా తన రాజీనామాను కోరటం కూడా మొదటిసారేమీ కాదని, తను కూడా రాజీనామా చెయ్యబోవటం లేదని ఆయన స్పష్టం చేసారు.  పార్లమెంట్ లో చర్చలను ముందుకు సాగనివ్వాలని, వారి అభ్యంతరాలను తెలియజేయటానికి అదే సరైన స్థలమని, అంతే కానీ చర్చలను అడ్డుకుని ఆందోళన కొనసాగించటం, రాజీనామాలను కోరటం సబబు కాదని మన్మోహన్ సింగ్ అన్నారు. 

నాలుగు రోజుల క్రితం, ఐదు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగిన సంఘటనలో పోలీసుల నిర్లిప్తతతను ఖండిస్తూ అందుకు పోలీస్ కమిషనర్ ను కూడా రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షాలు కోరాయి.  కానీ, తన రాజీనామా వలన సమస్య అంతమవదని, జరిగే ప్రతి రేప్ నీ అడ్డుకోవటం సాధ్యమైన పని కాదని, రాజీనామా చెయ్యటం వలన సమస్య పూర్తిగా అంతమవుతుందని అంటే తను వెయ్యి సార్లు రాజీనామా చెయ్యటానికైనా సిద్ధమేనని ఆయన అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles