రాష్ట్ర మఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. బెల్టు తీస్తానని చెబుతున్నారు. జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న మద్యం విషయంలో సిఎం దూకుడు పెంచారు. బెల్టు షాపులను మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెల్టు షాపులు తీసేయాల్సిందే. వీటిని ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేయలేదు. వీటికి లైసెన్సు ఏమీ ఇవ్వలేదు. లైసెన్సులు ఇచ్చిన షాపులకు అదనంగా వీటిని పెట్టారు. బెల్టు షాపులను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం. అంచెలంచెలుగా వీటిని తొలగించి తీరతాం' అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. బెల్టు షాపుల ఎత్తివేతపై తొలిసారిగా ఆయన స్పందించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆయన పర్యటించారు. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, కొండపల్లి గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన పురా పథకం శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌తో కలిసి పాల్గొన్నారు. అదే జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలోని గుడిమెట్లలో ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో స్వయం సహాయక బృందాల మహిళలతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఏలూరులో జరిగిన బహిరంగ సభలో తొలుత కేంద్ర మంత్రి జైరాం రమేశ్ మాట్లాడారు. బెల్టు షాపుల విషయాన్ని ప్రస్తావించారు. వీటిని తక్షణం ఎత్తివేయాలని, దీనికి ఏలూరే వేదిక కావాలని పట్టుబట్టారు. ఇందుకు ఎంపీలు కూడా అనుకూలంగా ఉన్నారని చెప్పారు. రేపో, మాపో కాదు.. ఈరోజు ముఖ్యమంత్రి బెల్టు షాపులపై నిర్ణయం ప్రకటించాల్సిందేనని పంతం పట్టారు. అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రి కోరికను తప్పనిసరిగా తీరుస్తామని ప్రకటించారు. దశలవారీగా బెల్టు షాపులను ఎత్తివేస్తామని చెప్పారు. బంగారు తల్లి పథకాన్ని స్వాగతించాలని, దేశంలోనే తొలిసారిగా ఆడపిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన ఈ పథకం అమలుకు ఎంత ఖర్చయినా వెనకాడబోమని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more