Sreesanth and others get bail

Sreesanth,Rajasthan Royals,IPL spot-fixing,IPL,AnkeetChavan

In a big setback to the Delhi Police, a city court on Monday granted bail to suspended Rajasthan Royal players S Sreesanth and Ankeet Chavan and 17 others in the IPL spot-fixing case, saying there was not enough material to link them to any organised crime gang.

శ్రీశాంత్ కి స్వేఛ్చా వాయువులు

Posted: 06/11/2013 12:51 PM IST
Sreesanth and others get bail

కేరళ స్పీడ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టు అయి, గత ఇరవై ఆరు రోజుల నుండి నాలుగు గోడల మధ్య జీవితాన్ని గడిపిన శ్రీశాంత్ కి ఎట్టకేలకు ఢిల్లీ కోర్టు స్వేచ్చా వాయువులు పీల్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. అంటే బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా గుర్తించి ప్రప్రథమంగా అరెస్టైస్టు చేసిన శ్రీశాంత్‌, ఛావన్‌లతో పాటు మరో 17 మందికి ఢిల్లీలోని మోకా కోర్టు సోమవారం సాయంత్రం షరుతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. బెయిలు పొందిన ఈ 21 మంది దర్యాప్తు పూర్తయ్యే వరకు దేశం వదిలి వెళ్లరాదని, అందుకు అనుగుణంగా తమతమ పాస్‌పోర్టులు కోర్డుకు అందజేయాలని ఆదేశించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంలో జరిగిన వాదనలలు విన్న కోర్టు సంబంధిత వ్యక్తులపై మోకా చటం ప్రయోగించడానికి అవసరమైన సాక్ష్యాదారాలను పోలీసులు చూపించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. దీంతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. అరెస్టు అయిన వ్యక్తులు దాదాపు అందరికీ బెయిలు లభించినప్పటికీ అజిత్‌ చండీలా మాత్రం జైలులోనే ఉండిపోనున్నాడు. అజిత్‌ ఇప్పటి వరకు బెయిలు కావాలని కోర్టుకు దరఖాస్తు చేయకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. దీంతో అతను జైలులోనే ఉన్నాడు. నేడు శ్రీశాంత్ ఇంటికి చేరుకోనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles