Political pm office refuses to answer rti query on robert vadra citing confidentiality

manmohan singh, prime ministers office, robert vadra, sonia gandhi, vadra land deal, breaking news, ap politics, political news, andhra news

pm office refuses to answer rti query on robert vadra citing confidentiality

‘అల్లుడ్ని ’ కాపాడిన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

Posted: 06/13/2013 11:54 AM IST
Political pm office refuses to answer rti query on robert vadra citing confidentiality

అల్లుడ్ని కాపాడిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంటే తన సొంత అల్లుడ్ని కాదులేండి. ఏఐసీసీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వద్రాకు అండగా ఉన్నట్లు విమర్శలొస్తున్నాయి. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వద్రాకు సంబంధించిన భూ వివరాలు కావాలని సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్‌ను ప్రధాన మంత్రి కార్యాలయం తిరస్కరించిందన్న కథనం ఆశ్చర్యం కలిగిస్తుంది. సోనియా అల్లుడి భూములు వివరాలు రహస్యం అని పిఎమ్ఓ తెలిపిందట. దీంతో సోనియా గాంధీ కుటుంబానికి ప్రధాని అండగా నిలుస్తున్నారా అని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వద్రా కేసుకు సంబంధించిన అంశాలను వివరించవలసిన సమాచార హక్కు కమిషన్ కూడా ఆ వివరాలను బహిర్గతం చేయడం కుదరదని పిటిషన్‌ను తోసిపుచ్చింది. హర్యానాలో రాబర్ట్ వద్రా అక్రమంగా భూములు పొందారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన వివరాలు రహస్యంగా ఉంచడం ద్వారా చాలా అనుమానాలకు తావిస్తోందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles