Venues to invest as rupee value falls down

Increased investment, value of rupee decreases, value of Rupees increases and decreases, rupee value of decreasing,

venues to invest as rupee value falls down

రూపాయి విలువ తగ్గటంతో పెట్టుబడులు ముమ్మరం

Posted: 06/21/2013 01:12 PM IST
Venues to invest as rupee value falls down

అంతర్జాతీయ స్థాయిలో రూపాయి విలువ తగ్గి డాలర్ కి 60 రూపాయల మారక విలువ పడిపోవటంతో ప్రవాస భారతీయుల దృష్టి దేశంలో పెట్టుబడుల మీదకు మళ్ళుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆశపడుతున్నారు.  

బంగారం ఖరీదు పెరగటం ఆగిపోవటంతో అది అంతగా లాభసాటి పెట్టుబడిగా కనపడటం లేదు.  భారత దేశంలో షేర్ల మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు.  తరచుగా మార్పులకు గురవుతుంటుంది.  అందువలన సంపన్నులైన ప్రవాస భారతీయులు నివాస, వ్యాపార భవనాలలో పెట్టుబడి పెట్టవచ్చన్న అంచనాలున్నాయి.  

అయితే, భారత దేశంలో రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇంకా తగిన సమయం కోసం వేచి చూస్తున్నారు.  ఎందుకంటే ఆ పెట్టుబడుల వలన కిరాయి రూపంలో వచ్చే ఆదాయం అంతగా ఆకర్షణీయంగా లేదు.  అంటే పెట్టుబడికి తగ్గ ఆదాయం అద్దెల ద్వారా వచ్చే సూచనలు లేవు.  దీర్ఘకాలిక పెట్టుబడిగా భవిష్యత్తులో ఆస్తి విలువ పెరగటం మాత్రమే లెక్కలోకి తీసుకుంటే పరవాలేదు కానీ వాటి మీద వెంటనే ఆదాయం రావాలంటే మాత్రం పెట్టుబడికి తగ్గ ఆదాయం కనపడదు. 

అయినా, పెట్టుబడులకు ప్రస్తుతమున్న అవకాశాలలో చిరాస్తులే ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నాయని ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ ప్రతినిధి సంతోష్ టెండల్ తన అభిప్రాయాన్ని తెలియజేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles