ఇటీవల కాలంలో నేరాలో, రెండో జోన్ గా గుంటూరు పేరుతెచ్చుకుంటుంది. గుంటూరు లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందనే గత సంఘటనలే నిదర్శనం. ఈ రోజు ఒక ఇంటర్ అమ్మాయిపై దారుణం జరిగింది.పెళ్లికి నిరాకరించినందుకు ఓ ఇంటర్ విద్యార్ధినికి ముగ్గురు యువకులు పురుగుల మందు తాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి..గోరంట్లలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంత్సరం చదువుతున్న మానస అనే విద్యార్ధినిని అదే ప్రాంతానికి చెందిన అనిల్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ నిరంతరం వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు ఆ యువకున్ని మందలించారు. ఈ క్రమంలో అనిల్ తన స్నేహితులు రాజు, అశోక్ లతో కలిసి వచ్చి శుక్రవారం కళాశాలకు వెళ్తున్న మానసను ఆటోలోకి బలవంతంగా ఎక్కించారు. అనిల్ ను పెళ్లి చేసుకోవాలని వారు బలవంతపెట్టారు. దీనికి నిరాకరించడంతో వారు తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందును బలవంతంగా ఆమెతో తాగించారు. ఆమెను కళాశాల వద్ద వదిలివెళ్లారు. కళాశాల వద్దకు చేరుకోగానే మానస స్పృహ తప్పి పడిపోయింది. విషయాన్ని గమనించిన కళాశాల యాజమాన్యం 108 ద్వారా ఆమెను గుంటూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లి దండ్రులకు సమాచారమందించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టరు ప్రస్తుతం విద్యార్ధిని పరిస్ధితి నిలకడగానే ఉందని తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకునన్న పోలీసుల నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more