Tv actress charu asopa booked for obtaining passport on fake details

TV actress Charu Asopa booked for obtaining passport on fake details, TV actress Charu Asopa , Somveer Pujari,

TV actress Charu Asopa booked for obtaining passport on fake details

తప్పుడు పని బుక్కైన టీవీ నటి

Posted: 06/28/2013 12:33 PM IST
Tv actress charu asopa booked for obtaining passport on fake details

స్టార్ సెలబ్రిటి అయిన తరువాత చిన్న చిన్న తప్పులు చేసి పోలీసులకు దొరికిపోతున్నారు నటీమణులు. టీవీ నటి చారు అసోపా తప్పుడు వివరాలతో పాస్ పోర్ట్ పొందడానికి ప్రయత్నించి దొరికి పోయింది. రాజస్థాన్‌లోని బికనీర్ పట్ట నుంచి ఆమె పాస్ పోర్టు పొందడానికి ప్రయత్నించింది. ఇందు కోసం ఆమె తప్పుడు వివరాలు సమర్పించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం....పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆమె తనకు పెళ్లి కాలేదని పేర్కొంది. అయితే తర్వాత పోలీసులు ఆమెకు సంవీర్ పూజారితో వివాహం అయినట్లు గుర్తించారు. దీంతో ఆమెను బుక్ చేసారు. తప్పుడు వివరాలతో పాస్ పోర్టు పొందడం నేరం. ఈ మేరకు ఆమెపై పాస్ పోర్టు చట్టం మరియు ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఆమెకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా సాదర్ పోలీసులకు ఎస్‌పి సూచించారు. ఈ మేరకు ఆమెపై కేసు విచారణ జరుగనుంది. నటి చారు ఆసోపా హిందీతో పాటు పలు ఉత్తరాది టీవీ కార్యక్రమాల్లో నటించింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles