Family of 4 from narasaraopet die in accident

Shirdi, accident, family, Nagardole, Narasaraopet

Four members of a family died in Shirdi when a tree fell on the taxi in which they were travelling.

దైవ దర్శన యాత్రలో విషాదం

Posted: 07/18/2013 12:32 PM IST
Family of 4 from narasaraopet die in accident

ఒకే కుటుంబం నుండి దైవ దర్శనానికి వెళ్లిన నలుగురు ఏకంగా దేవుడి దగ్గరికే వెళ్లి పోయారు. దైవ దర్శన యాత్ర ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన ఓ కుటుంబం కారులో షిర్టీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నరసారావుపేట నుండి నాగర్ సోల్ వరకు రైల్లో వెళ్లి, అక్కడి నుండి కారులో షిర్టీకి ప్రయాణిస్తున్న సమయంలో కారు పై ఓ భారీ చెట్టు కూలడంతో కారులో ఉన్న ముగ్గురు మహిళలతో పాటు మరొకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయట పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. చనిపోయిన వారిలో రాధా క్రిష్ణమూర్తి, రంగనాయకమ్మ, బాలత్రిపురా సుందరి, ఆషా ఉన్నారు. ఆశా, ఆంజనేయులు అనేవారు గాయాలతో చికిత్స పొందుతున్నారు. విధి వెంటాడి చంపడం అంటే ఇదేనేమో మరి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles