Godavari reached 51 4 feet height

Godavari reached 51.4 feet, Bhadrachalam area hit by floods, Manuguru coal mines area, Godavari floods devastating

Godavari reached 51.4 feet height

భయంకరంగా మారిన గోదావరి ఉధృతి

Posted: 07/19/2013 12:10 PM IST
Godavari reached 51 4 feet height

గోదావరి ఉధృతం ఆందోళనకరంగా మారింది.  భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది.  నిన్న ఉదయం 36 అడుగుల ఎత్తు ఉన్న నీటిమట్టం శరవేగంతో ఈ రోజు 51.4 అడుగులకు చేరింది.  43 అడుగుల ఎత్తుకి చేరేటప్పటికే రెండవ ప్రమాద హెచ్చిరికను చేసిన అధికారులు ఇప్పుడు మూడవ హెచ్చరికను చెయ్యటానికి సిద్ధమౌతున్నారు. 

భయంకరంగా మారిన గోదావరి ఉధృతి బొగ్గు గనులున్న మణుగూరు ప్రాంతంలో గ్రామాలను నీట ముంచింది.  భద్రాచలానికి దిగువ ప్రాంతం కూడా జలమయమై రాకపోకలు నిలిచిపోయి గ్రామవాసులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. 

భద్రాచలం సబ్ కలెక్టర్, ఇతర అధికారులు లాంచీలలో తిరుగుతూ పరిస్థితిని సమీకరిస్తున్నారు.  లాంచీలలో పడవల్లో వీలయినంత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles