Sonia gandhi final decision on telangana

sonia gandhi final decision on telangana, telangana live, telangana state today, final decision, working committee (cwc) meeting in delhi, sonia gandhi clears telangana division, breaking news, ap politics, political news, andhra news

Sonia gandhi Final decision on Telangana

అసలు ఏం జరుగుతుంది?

Posted: 07/30/2013 09:36 AM IST
Sonia gandhi final decision on telangana

ఈ రోజు కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేక తెలంగాణ పై తుది నిర్ణయం ప్రకటించనుంది. ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ పైనే ఉంది. ఈ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశంలో ఏం మాట్లాడారు. అసలు ఎలాంటి తీర్పు ఇస్తారు అనే దాని పై అందరిలో టెన్షన్. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాన మంత్రి నివాసంలో జరిగే యూపీయే సమన్వయ సమితి సమావేశంలో సోనియాగాంధీతో పాటు, హోంమంత్రి షిండే, మరికొందరు సీనియర్లు పాల్గొనే అవకాశాలున్నాయి. ఈ భేటిలో తెలంగాణపై తమ మనసులోని మాటలను ప్రధాన మంత్రి సోనియా గాంధీలు మిత్రపక్షాల సభ్యుల ముందుంచుతారు. సమస్య క్రమాన్ని వివరించి, ప్రస్తుతం ఏం నిర్ణయం తీసుకోబోతున్నది చెప్పి, దానిపై మిత్రపక్షాల అభిప్రాయాలను కోరుతారు. వారు ఏం చెబుతారన్న దానిపై తదుపరి నిర్ణయం ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ ప్రతిపాదనకు ఎన్సీపీ, ఆర్ఎల్ డీ తక్షణం ఆమోదించే అవకాశం ఉంది. రాయల సీమాలోని రెండు జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రతిపాదన తెచ్చినా, హైదరాబాద్ ఉమ్మడి రాజదాని అన్నా మిత్రపక్షాల్లో కొంత చర్చ జరిగే సూచనలున్నాయి. దేశంలోని మిగతా చిన్న రాప్ట్రాల ఏర్పాటు కోసం రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేసే అంశం కూడా ఈ సందర్భంగా తెరమీదకి రావోచ్చని అంచనావేస్తున్నారు. చివరిగా ఒక అభిప్రాయానికి వచ్చి దానిపై తీర్మానం చేయెచ్చని తెలుస్తోంది. ఆ తీర్మానాన్ని తీసుకొని కాంగ్రెస్ అధిష్టానం సీడబ్లూసి ముందుకు రావోచ్చని రాజకీయ మేథావులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles