Rare sight at tirumala hills

Tirupati Venkateswara Swamy, Tirumala Hills, Tirumala piligrims plight in Bandh, Tirumal bus service halted in bandh, Deserted look on Tirumala in strike, Chief Minister of AP, Tirumala Tirupati Devasthanams

rare sight at tirumala hills

తిరుమలలో అరుదైన దృశ్యం

Posted: 08/14/2013 11:00 AM IST
Rare sight at tirumala hills

గత 35 సంవత్సరాలుగా చూడని అరుదైన దృశ్యం నిన్నతిరుమలలో కనిపించింది.  సమైక్యాంధ్ర ఉద్యమంలో రాష్ట్రంలో జరుగుతున్న నిరసనలు, బంధ్ ల పిలుపు వలన ఆలయ ప్రాంగణం బోసిపోయింది.  కానీ అక్కడ ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం చేసుకోవటానికి, తిరుమలలోని గోపురాలు, పూదోటలు హాయిగా విహరిస్తూ చూడటానికి కావలసినంత సమయంతో పాటు జనసమ్మర్దం లేనందు వలన చక్కగా తనివి తీరా చూడగలిగే సందర్భం. 

కానీ తిరుపతి, తిరమల మధ్య నడిచే బస్సులు నిలిచిపోవటంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానముల సిబ్బంది కూడా సమ్మె లో పాల్గొనటంతో యాత్రికులు ఇబ్బందులు పడ్డారు. 

తిరుమలలోని కట్టడాలు, గోపురాలు, ఇతర విహార స్థలాలను భక్తజన కోటి లేకపోవటం వలన స్పష్టంగా చూడగలిగే పరిస్థితి ఉన్నా, తిరిగి ఇళ్ళకు పోవాలన్న ఆత్రుత, కిందికి వెళ్ళటానికి రవాణా సౌకర్యం ఉంటుందో లేదో అన్న ఆదుర్దా వారిలో చాలా మందిని, హాయిగా ఎప్పడూ లభించనంత అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తిలకించటానికి సావకాశం ఇవ్వలేదు.

ప్రతిరోజూ తిరుపతి నుంచి తిరుమలకు పోయే బస్సులు 500.  అవి ఒక్కొక్కటి వేసే ఆరారు ట్రిప్పుల వలన 3000 సర్వీసులు రోజుకి చేస్తుంటాయి.  అవి పూర్తిగా బంద్ వలన మూతపడటంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి వారు నోటికొచ్చినట్టుగా అడిగిన మొత్తాన్ని చెల్లించినవారు కొందరైతే, అలిపిరి నుంచి కాలిదారిలో వెళ్ళటానికి కొందరు నిశ్చయించుకుని తిరుమలైతే చేరుకున్నారు కానీ వచ్చేటప్పడు వాళ్ళు కాస్త ఇబ్బందుల పాలయ్యారు.

అయితే ముఖ్యమంత్రి జోక్యంతో, అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు కేవలం తిరుమలకు అక్కడ చిక్కుకుపోయిన యాత్రికుల సౌకర్యార్థం కొన్ని బస్సులు పరిమిత సంఖ్యలో నడుస్తున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles