Trs discussions on future plan at kcr farm house

Trs Discussions on Future Plan at KCR Farm House, TRS leaders to meet KCR, Protests continue in Seemandhra, Telangana granted statehood, A.P bifurcated, Seemandhra Secretariat employees, protest against

Trs Discussions on Future Plan at KCR Farm House, TRS leaders to meet KCR, Protests continue in Seemandhra, Telangana granted statehood, A.P bifurcated, Seemandhra Secretariat employees, protest against

హైదరాబాద్ మనదే...

Posted: 08/19/2013 08:38 AM IST
Trs discussions on future plan at kcr farm house

కేంద్రం పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ, కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉంచి, ఆ తరువాత హైదరాబాద్ తెలంగాణకే అంటూ కేంద్రం ప్రకటన చేసిన నేపధ్యంలో సీమాంధ్ర ప్రజలు, నాయకులు హైదరాబాదును వదులుకునేందుకు సిధ్దంగా లేదు. దీంతో కేంద్రం హైదరాబాద్ పై మెలిక పెట్టే సూచనలు ఉన్న నేపధ్యంలో ఈ విషయంలో తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ, టీ.కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదుకునేందుకు సిద్ధంగా లేమని ముక్తకంఠంతో చెబుతున్నారు. నిన్న మెదక్ జిల్లాలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ, పొలిట్ బ్యూరో సమావేశంలోనూ హైదరాబాద్ అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పై ఎలాంటి రాజీ షరతులకు లొంగరాదని టిఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది.

తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా మాత్రమే హైదరాబాద్ ఉండాలని,శాంతి భద్రతలతో సహా అన్ని తెలంగాణ రాష్ట్ర పరిదిలోనే ఉంచాలని డిమాండ్ చేయాలని కెసిఆర్ నిర్ణయించినట్లు కధనం. ఆదాయం పంచుకుంటామంటే కూడా కుదరదని, కేంద్ర పర్యేవేక్షణకు ఒప్పుకోబోమని కెసిఆర్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. అవసరమైతే మళ్లీ ఉద్యమం చేయాలని కూడా ఆ పార్టీ నిర్ణయించడం విశేషం. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కార్యచరణను రూపొందించింది.  తెలంగాణా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టడంతో పాటు సదరు బిల్లు కార్యారూపం దాల్చేవరకు పార్టీ విలీనం మాటే ఉండది, మండల స్థాయిలో టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. తెలంగాణాకు చెందిన ప్రతీ జిల్లాలో పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర చేయాలని, అది కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన తేదీలను కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎత్తులకు లొంగకూడదనే అభిప్రాయం సమావేశంలో వెల్లడైనట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles