Ponnala lakshmaiah for speedy t process

ponnala lakshmaiah speedy T process, Telangana Congress ministers, Antony Committee, Seemandhra Congress leaders, Hyderabad Common Capital for 10 years

ponnala lakshmaiah for speedy T process

తెలంగాణా తక్షణ ఏర్పాటే పరిష్కారం- క్యాబినెట్ మంత్రి

Posted: 08/20/2013 01:02 PM IST
Ponnala lakshmaiah for speedy t process

సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలకు సరైన మందు తెలంగాణా తక్షణ ఏర్పాటేనంటూ ఆంటోనీ కమిటీకి నివేదించిన కిరణ్ కుమార్ క్యాబినెట్ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైద్రాబాద్ విషయంలో రాజీపడేది లేదని నిక్కచ్చిగా కమిటీకి చెప్పానన్నారు.  అలాగే, నదీ జలాల విషయంలో ఇప్పటికే న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకోవటం జరిగిఁది కాబట్టి సీమాంధ్రులు కలతపడాల్సిన అవసరం లేదని అన్నారు.
సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలకు పరిష్కారం ఏమిటని కమిటీ ప్రశ్నించినదానికి పొన్నాల, వెంటనే తెలంగాణా ఏర్పాటే పరిష్కారమని అన్నారు.  

క్యాబినెట్ లోని తెలంగాణా మంత్రులు, హైద్రాబాద్ ని శాశ్వత ఉమ్మడి రాజధానిగా సమ్మతించేది లేదని, 10 సంవత్సరాల వరకైతే పరవాలేదని అన్నారు.  హైద్రాబాదంటే మున్సిపల్, రెవిన్యూ పరిధిలో ఉన్న హైద్రాబాదేనని కూడా పొన్నాల స్పష్టం చేసారు.  

నిన్న తెలంగాణా మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో సంప్రదింపులు జరిపిన ఆంటోనీ కమిటీ ఈ రోజు సీమాంధ్ర నాయకులతో భేటీ కాబోతోంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles