Harikrishna birthday announcement

Harikrishna birthday announcement, Nandamuri Harikrishna, NT Rama Rao, NTR Ghat, Rajya Sabha Member Harikrishna, Harikrishna speech in Telugu in Rajyasabha

harikrishna birthday announcement

హరికృష్ణ జన్మదిన ప్రకటన

Posted: 09/02/2013 11:44 AM IST
Harikrishna birthday announcement

ఈరోజు తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నాయకుడు, తెలుగు సినిమా ప్రపంచంలో ఆగ్ర నాయకుడు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ తన జన్మదిన సందర్భంగా తండ్రి సమాధి దగ్గర నివాళులర్పించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.  

సెప్టెంబర్ 2, 1956లో నిమ్మకూరులో జన్మించిన హరికృష్ణ తెలుగు దేశం పార్టీ తరఫునుంచి రాజ్యసభకు ఎన్నికై ఉన్నారు. కానీ సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఆయన రాజీనామా చేసి ఆమోదాన్ని కూడా పొందారు.  

ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించిన తర్వాత హరికృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  తాను తన రాజీనామా పత్రంలో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్టు పేర్కొంటూ, అలా స్పష్టంగా ఉంటే ఎవరి రాజీనామా అయినా ఆమోదాన్ని పొందుతుందని అన్నారు.  తాను ప్రజల కోసమే రాజీనామా చేసానని, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చెయ్యటమే రాజకీయ నాయకుల విధి అని ఈ సందర్భంగా తెలియజేసిన హరికృష్ణ, తాను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నానని, అందరూ ఐకమత్యంగా మెలగాలన్నదే తన ఆకాంక్షని అన్నారు.  సమ్మెలో పాల్నొన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు.  

ఆగస్ట్ 12 న ఆయన రాజ్యసభలో తెలంగాణా ఏర్పాటు విషయంలో ఆవేశపూరితంగా తెలుగులో మాట్లాడారు.  అందరూ అభ్యంతరాలు తెలపగా, నన్ను హిందీలో కానీ ఇంగ్లీషులో కానీ మాట్లాడమని కోరటం తెలుగువారిని అవమానించినట్లేనని అన్నారు.  ఉన్నట్టుండి తెలుగులో మాట్లాడటం మొదలపెట్టేసరికి రాజ్యసభ ఉప సభాపతి కురియన్ ఆ రోజు అనువాదకులు లేక ఇబ్బంది పడ్డారు.  దానితో ఆంధ్రప్రదేశ్ కి ఎంత దుర్దినం, విభజన విషయంలో ఆందోళన చెందుతున్న తెలుగువారి మనోభిలాషలను వెలిబుచ్చే ఉపన్యాసానికి అనువాదం చేసేవారే కొరవయ్యారంటూ హరికృష్ణ సభలో తన ఆవేదనను వ్యక్తం చేసారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles