Sushma swaraj demands pm statement under oath

PM Statement under oath, Sushma Swaraj, Manmohan Singh, coalgate scam, coal blocks allocation, coal files missing, CBI on coal allotment scam

Sushma Swaraj demands PM statement under oath

ప్రధాని ప్రమాణం చేసి చెప్పాలి-సుష్మా స్వరాజ్

Posted: 09/04/2013 03:52 PM IST
Sushma swaraj demands pm statement under oath

బొగ్గు కుంభకోణంలో కీలకమైన ఫైళ్ళు కనపడకపోవటం మీద మండిపడుతున్న ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టించటంతో పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులు ముందుకు సాగటంలేదు, ప్రవేశపెట్టవలసినవి వెనకే ఉండిపోతున్నాయి.  ఇప్పటికే పోయిన నెల 30 వరకు సాగవలసిన సభలు పొడిగించటమైంది.  అయినా సభ సజావుగా సాగక, అనుకున్న పనులు అవకపోవటంతో ఈ రోజు ఆర్థిక మంత్రి చిదంబరం, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమలనాథ్ లు ప్రతిపక్ష నేతలో భేటీ అయ్యారు.  పెన్షన్ సంబంధించినవి ఇంకా మిగిలిన ముఖ్యమైన బిల్లులను ఆమోదించవలసిందిగా కోరారు.  

కానీ బొగ్గు ఫైళ్ళ అదృశ్యం పార్లమెంటులో గందరగోళ స్థితిని నెలకొల్పుతోంది.  60 ఫైళ్ళు కనపడకపోగా అందులో 16 ఫైళ్ళు బొగ్గు కుంభకోణం మీద దర్యాప్తు చేస్తున్న సిబిఐ కి ఆ దర్యాప్తులో కీలకమైనవి కావటం విశేషం.  ఆ కుంభకోణం జరిగినప్పుడు ఆ శాఖ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కింద ఉండటం వివాదానికి దారితీస్తోంది.  లోగడ చాలాసార్లు ప్రతిపక్షాలు ప్రధాన మంత్రి వివరణను కోరాయి.

రెండుసార్లు వాయిదా పడ్డ సభ తిరిగి 2.30 కి ప్రారంభమైన తర్వాత, ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతాపార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్, ప్రధాన మంత్రి ప్రమాణం చేస్తూ వాటి విషయమై చెప్పవలసిందిగా డిమాండ్ చేసారు.  కోర్టులో చెప్పినట్టుగా ప్రమాణం చేస్తూ ఆ కేసులో ఫైళ్ళ గల్లంతు విషయంలో ప్రధానమంత్రి వ్యక్తిగతంగా సాక్ష్యం చెప్పాలంటూ సుష్మా స్వరాజ్ కోరారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles