Strike against go 108 compounding penalty

Autos strike against GO 108, GO 108 increases penalties, traffic violation penalties enhanced, Auto rickshaws hit by GO 108

Strike against GO 108 compounding penalty

మరో రోజు ఆటోలు బంద్

Posted: 09/05/2013 12:12 PM IST
Strike against go 108 compounding penalty

జివో 108 కి నిరసనగా నిరసనగా నిన్నటినుంచి చేస్తున్న ఆటోల బంద్ ఈ రోజు కూడా హైద్రాబాద్ లో కొనసాగుతోంది.

జీవో 108 ప్రకారం ట్రాఫిక్ పోలీస్ కాంపౌండ్ పెనాల్టీని రూ.1000 వసూలు చెయ్యవచ్చు.  ఇది రెడ్ సిగ్నల్ దాటినా, అనుమతిని మించి ఎక్కువ మందిని ఆటోలో కూర్చో బెట్టుకున్నా, నిధేషించిన చోట పార్కింగ్ చేసినా, లేక సెల్ ఫోన్ లో మాట్లాడుతూ ఆటో నడుపినా వర్తిస్తుంది.  ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోయినా సరే ఫైన్ చెల్లించవలసిందే. 

ఈ జీవో అమలులోకి రావటంతో బెంబేలెత్తిన ఆటో డ్రైవర్లు, కష్టపడి రోజుకి 300 నుంచి 400 వరకు ఇంటికి తీసుకుపోతున్నవాళ్ళం ఒక్కసారి ఫైన్ కడితే మూడు రోజుల ఆదాయం పోయినట్లే కదా, ఎలా బతకాలింక అని వాపోతున్నారు.  అలాంటివి మళ్ళీ కట్టవలసివస్తే ఇంకా కష్టమౌతాయి మా బతుకులు అంటూ జివొ 108 కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. 

నగరంలో ఆటోలు ఎన్నో విధాలుగా నడుస్తుంటాయి.  హాస్పిటల్స్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ ల మీద కొందరు ఆధారపడితే మరి కొందరు స్కూల్ కి పిల్లలను తీసికెళ్ళటం, ఉద్యోగస్తులకోసం షేర్ ఆటో సర్వీస్ నడపటం చేస్తుంటారు.  ఆర్ టి సి సౌకర్యం అంతగా లేని చోట, లేక బొత్తిగా లేని కొత్త కాలనీలకు పాసెంజర్లను చేరవేస్తుంటారు.  ఇంకా, ఎవరు ఎక్కడ ఎక్కి ఎక్కడికి తీసుకుపోమని అన్నా తయారుగా నగరంలో తిరుగుతుంటారు.  అయితే వాళ్ళు మీటర్లను పట్టించుకోరనుకోండి.  వర్షం పడుతున్నా లేక రాత్రి అయినా లేదా ఆర్ టి సి సమ్మెలాంటివేమైనా ఉన్నా ఇక వాళ్ళ నోటికి వచ్చిన కిరాయి ని మాట్లాడుకుంటారు.  నగరానికి కొత్తగా వచ్చినవారు, వెళ్ళవలసిన చోటికి బస్సులో చేరుకోలేనివారు వాళ్ళు అడిగిన సొమ్ము చెల్లించి ప్రయాణం చేస్తారు.  అయినా క్షేమంగా చేరవేసినందుకు ప్రయాణీకులు ఆనందపడుతుంటారు. 

ఆటో నడపటానికి లైసెన్సుందంటే ట్రాఫిక్ ఆంక్షలను అతిక్రమించవచ్చని కాదు కానీ, ఇలా విపరీతమైన సుంకాలతో అనవసరంగా కూడా ఒక్కోసారి డబ్బు కట్టవలసివస్తుందని భయపడుతున్నారు.  వెయ్యి రూపాయల ఫైన్ ల చలాన్ పుస్తకం చూపించి భయపెట్టి ప్రతిసారీ ఎంతో కొంత తీసుకుంటారేమోనన్న ఆందోళన వాళ్ళని వేధిస్తోంది.  నెలాఖరుకి టార్గెట్ ని అందుకోవటానికి కూడా ఏదో వంకతో చలాన్లు ఇచ్చే అవకాశం కూడా ఉందని అంటున్నారు ఆటో డ్రైవర్లు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles