Prasada rao appointed as ap dgp in charge

Prasada Rao appointed as AP DGP in-charge, Prasada Rao, DGP Dinesh Reddy, Dinesh Reddy service extension, Dinesh Reddy retirement

Prasada Rao appointed as AP DGP in-charge

ఇన్ ఛార్జీ డీజీపీగా గుంటూర్ మిర్చి ?

Posted: 09/30/2013 07:50 PM IST
Prasada rao appointed as ap dgp in charge

ఇన్ ఛార్జీ డీజీపీగా బయ్యారపు ప్రసాదరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తికాల డీజీజీ కోసం యూపీఎస్సీ నుంచి నియామక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అప్పటి వరకు ఆయన ఇన్ ఛార్జీ డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తారు. 1979 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ప్రసాదరావు ఇప్పటివరకు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఆయన పదవీ విరమణకు ఇంకో రెండేళ్ల సమయం ఉంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర పోలీస్ బాస్ గా నియమితుడైన అధికారి పదవీ విరమణ వయస్సుతో సంబంధం లేకుండా నియామకం తేదీనాటి నుంచి రెండేళ్లు ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా ప్రసాదరావు ఈ పదవికి సరిపోతారని భావించిన ప్రభుత్వం ఈ రోజు నియామక ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన ప్రసాదరావు భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ చదివారు. తొలియత్నంలోనే ఐపీఎస్ కి ఎంపియ్యారు. కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, జిల్లాల ఎస్పీగా పనిచేశారు. సీఐఎఫ్ కమాండెంట్, విజిలెన్స్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఏలూరు, కర్నూలు డీఐజీగా , శాంతి భద్రతలు, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ అదనపు డీజీగా పనిచేశారు. ప్రసాదరావు 2015 సెప్టెంబర్ 30 వరకు రాష్ట్ర డీజీపీ పదవిలో ఉంటారు.

 

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles