Bjp kishan reddy fire on cm kiran

Kishan Reddy Fire On CM Kiran , BJP Kishan Reddy Fire On CM Kiran , EX DGP Dinesh Reddy, Sensational Statements On CM Kiran, Chanchalguda jail,

Kishan Reddy Fire On CM Kiran , BJP Kishan Reddy Fire On CM Kiran , EX DGP Dinesh Reddy, Sensational Statements On CM Kiran, Chanchalguda jail,

కిరణ్ వెళ్ళేది జగన్ బ్యారెక్ లోకే ?

Posted: 10/09/2013 08:45 AM IST
Bjp kishan reddy fire on cm kiran

 

 

 

తమ పార్టీ అంతర్గత కలహాలతో గత వారం రోజుల నుండి సైలెంట్ గా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అలక వీడినట్లు కనిపిస్తుంది. ఇటీవలే పదవీచ్చ్యుడై మాజీగా మారిన డీజీపీ దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి కిరన్ కుమార్ రెడ్డి పై నిన్న తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కిరణ్ అక్రమంగా సంపాదించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, తన తమ్ముడితో ఈ అక్రమాలకు పాల్పడ్డారని దినేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎంపై చేసిన ఆరోపణలపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాలని, నేరం రుజువైతే చంచల్‌గూడ జైలులో వైఎస్ జగన్ ఖాళీ చేసిన బ్యారక్‌కు కిరణ్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.

సీమాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ విభజనకు వ్యతిరేకంగా కిరణ్ కుట్ర చేస్తున్నారని, పోలీసు వ్యవస్థనూ దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం సోదరుడు సంతోష్‌రెడ్డిపై గతంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయని, ఇప్పుడు మాజీ డీజీపీనే స్వయంగా చెబుతున్నాడంటే కిరణ్ పై ఖచ్చితంగా విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. నిన్న మొన్నటి వరకు నేను రెడ్డి, నువ్వు రెడ్డి అంటూ ఉన్న వీరిద్దరి మధ్య వైరం రావడానికి కారణం ఏమిటో ?

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles