Apsrtc planned to increase bus charges

apsrtc planned to increase bus charges, Andhra Pradesh State Road Transport Corporation, APSRTC, AK Khan, samaikyandhra movment effect on apsrtc,

apsrtc planned to increase bus charges

ప్రయాణికుడిపై త్వరలో బస్సు బాధుడు

Posted: 10/22/2013 06:54 PM IST
Apsrtc planned to increase bus charges

అసలే అప్పులతో కుయ్యో..మొర్రో అంటూ.. నడుస్తున్న బస్సు పై సడన్ గా.. సీమాంద్రలో సమైక్యాంద్ర సమ్మె దెబ్బ పడింది. రెండు నెలల పాటు.. బస్సులకు సెలవు దొరికింది. కానీ.. రోజు రోజుకి .. ఆర్టీసీ అప్పుల భారం పెరిగిపోవటంతో పూర్తిగా నష్టాల ఊబిలోకి కురుకుపోయింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ను బయటకు తీయ్యాలంటే.. ఒక్కటే మార్గం. ఆర్టీసీ ప్రయాణికుడిపై బస్సు భారం వేయ్యటం ఒక్కటే మార్గం. ఈ విషయం పై ఆర్టీసి చైర్మన్ ఎకే.ఖాన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఒకే అంటే ప్రయాణికుడిపై.. మరో భారం పడనుంది.

 

ఆర్టీసి బస్సు ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. నిర్వహణ భారం పెరిగిపోవడంతో ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసి అధికారులు చెబుతున్నారు. సీమాంధ్రలో సమ్మె కారణంగా ఆర్టీసికి తీవ్ర నష్టం వాటిల్లింది. దానికి తోడు డీజిల్ ధర కూడా పెరిగింది. ఈ పరిస్థితులలో బస్సు ఛార్జీలు పెంచాలని నిర్ణయించారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఛార్జీలు పెంచుతారు.

 

అయితే ఛార్జీలను అతిగా పెంచరని, స్వల్పంగానే పెంచుతారని భావిస్తున్నారు. ప్రయాణికులకు మరీ భారంగా లేకుండా పెంపుదల ఉంటుందని చెబుతున్నారు. ఏమైన ప్రయాణికి ఆర్టీసి బస్సు ఛార్జీల పెంపుతో .. మరో భారం పడినట్లేనని ప్రజలు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles