తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తే.. తప్పనిసరిగా ఓడిపోతుందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. కాగా, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేలు సీమాంధ్ర ప్రాంతంలోనే ఉన్నారని తెలిపారు. తెలంగాణాలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే, సీమాంధ్రలో 170 మందికి పైగా ఎమ్మెల్యేలున్నారన్నారు. ఒకవేళ తీర్మానం అసెంబ్లీకి వస్తే ఓడిపోవడం ఖాయమని తనదైన శైలిలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ , బీజేపీలు అనుకూలంగా ఉన్నందున పార్లమెంట్ టీ.బిల్లు తప్పక ఆమోదం పొందుతుందన్నారు.
సీమాంధ్ర ప్రజా ప్రతినిధులకు టీ.తీర్మానాన్ని ఓడించడం అసెంబ్లీలో సాధ్యపడే అంశమేనన్నారు. కాగా, రాష్ట్ర ఏర్పాటు అనేది అసెంబ్లీ ప్రాతిపదికన జరుగుతుందని తాను అనుకోవడం లేదని వీ.హెచ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అనేది కాంగ్రెస్ వల్లే సాధ్యమైందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని టీఆర్ఎస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ 15 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని వీ.హెచ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇప్పటికే తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని.. ఎలాగై ఓడించాలనే ఉద్దేశంతో.. సీమాంద్ర నేతలు రాజీనామాలు చేయ్యకుండా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు.. వారికి సపోర్టు మాట్లాడటంతో.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఖంగుతిన్నారు. ఆయన ఏ ఉద్దేశంలో అన్నారో గానీ, మొత్తానికి తెలంగాణ నేతల్లో కొత్త భయాన్ని పుట్టించాడు అనేది వాస్తవం.,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more