Students stone chiranjeevi in seemandhra

Students stone Chiranjeevi in seemandhra, Students stone Chiranjeevi in Srikakulam, tourism minister Chiranjeevi, GMR IT institute at Rajam, Rajam threw stones

Students stone Chiranjeevi in seemandhra, Students stone Chiranjeevi in Srikakulam

చిరంజీవిపై రాళ్లువిసిరిన సీమాంద్ర ప్రజలు

Posted: 10/29/2013 06:33 PM IST
Students stone chiranjeevi in seemandhra

కేంద్ర మంత్రి చిరంజీవి చేస్తున్న వరద ముంపు ప్రాంతాలల్లో పర్యటన ఆయనకు కలిసిరావటంలేదు. నిన్న చిరంజీవి కాలు జారి నీటిలో పడ్డారు. ఈరోజు రాజాంలో సమైక్యవాదులు చిరంజీవిపై రాళ్లు విసిరారు. మంత్రి చిరంజీవికి వరద ముంపు ప్రాంతాలలో పర్యటన మొదలుపెట్టిన నాటి నుండి అడుగడుగునా ఆందోళనలు, అటంకాలే ఎదురవుతున్నాయి.

ఈరోజు రాజాం జీఎంఆర్ ఐటీ కళాశాలలో విద్యార్థులు తమను పలకరించకుండా వెళ్తున్నారని ఆగ్రహించి చిరంజీవి పై కంకర రాళ్లు విసిరారు. అయితే వెంటనే భద్రతా సిబ్బంది పసిగట్టి, విద్యార్థులు విసిరిని రాళ్లు చిరంజీవి తగలకుండా కాపాడటం జరిగింది. జీఎంఆర్ వరలక్ష్మీ కేర్ ఆస్పత్రి సందర్శించి వస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.

అయితే విద్యార్థులతో పాటు సమైక్యవాదులు కూడా రాళ్లు విసిరారు. పదవి వదులుకున్న తరువాతే పర్యటనకు రావాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. అయితే అక్కడ నుంచి లావేరు మండలం బుడమూరులో వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు బయలుదేరారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles