Maid found dead at bsp mp s residence wife detained

Maid found dead at BSP MP-s residence wife detained, BSP Mp-s wife detained following maid-s death, Dhananjay Singh, Jagriti Singh, BSP MP, domestic violence, Bahujan Samaj Party, Jagriti Singh, Dhananjay Singh

Maid found dead at BSP MP-s residence wife detained, BSP Mp-s wife detained following maid-s death

ఎంపీ భార్య హింస – మహిళ డెత్

Posted: 11/05/2013 12:20 PM IST
Maid found dead at bsp mp s residence wife detained

రాజకీయ నాయకుల భార్యలు రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. న్యూఢిల్లీ లోని సౌత్ ఎవెన్యూలోని బహుజన సమాజ్ పార్టీ ఎంపీ ధనుంజయ్ సింగ్ నివాసంలో మహిళ పనిమనిషి తెల్లవారుజామున అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆ ఘటనపై పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ మహిళ మృతదేహన్ని పోలీసుల స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

 

అయితే ఎంపీ ధనుంజయ్ సింగ్ భార్య జాగృతి సింగ్ హింసించడం వల్ల పని మనిషి మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పనిమనిషి ఒంటి నిండా గాయాలు ఉన్నాయని తెలిపారు.అలాగే ఆమె తలకు తీవ్ర గాయమైనట్లు తాము గుర్తించామన్నారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ అసలు సంగతి బహిర్గతమవుతుందని పోలీసులు వెల్లడించారు.

 

ధనుంజయ్ సింగ్ భార్య జాగృతి సింగ్ తరచుగా పని మనిషి రాకీని హింసించేదని తొటి పనిమనిషి రాంపాల్ ను విచారించగా తెలిసిందని పోలీసులు తెలిపారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని జన్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ధనుంజయ్ సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. ఈవిషయం ఎంపీ ధనుంజయ్ సింగ్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయ్యలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ సంఘలు ఆందోలన చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles