Telangana bill in parliament by december 7 says balram naik

Union Minister P Balram Naik, Telangana Bill, Parliament by December 7, monsoon session, sonia birthday

alram Naik said that he hoped the Telangana Bill would be tabled in the Parliament during the monsoon session by December 7.

డిసెంబర్ లోనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు

Posted: 11/06/2013 08:00 AM IST
Telangana bill in parliament by december 7 says balram naik

తెలంగాణ ఏర్పాటు పై ఇటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, అటు సీమాంధ్ర నాయకులు ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క కేంద్రం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసి సమస్యలు పై చర్చించాలని, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత నిర్ణయం ఫైనల్ చేయాలని ఈ పక్రియ అంతా జరగడానికి సమయం పడుతుందని అంతా అనుకుంటుంటే...

నవంబరు ఏడున తెలంగాణ ప్రక్రియ పూర్తి అవుతుందని, డిసెంబరు ఏడున పార్లమెంటులో బిల్లు వస్తుందని కేంద్ర సహాయ మంత్రి అయిన బలరాం నాయక్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. నవంబరు ఏడున మంత్రుల బృందం చివరి సమావేశం జరుగుతుందని ఆయన చెబుతున్నట్లు భావించాలి. కాగా డిసెంబరు తొమ్మిదికి న సోనియా జన్మదినోత్సవం లోపు బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన చెబుతున్నారు.

కాంగ్రెస్ అధిష్టానం మీద ఈయనకు ఉన్న నమ్మకమో లేక సోనియా గాంధీ విధేయుడు అనిపించుకోవడానికి ఇలా మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియాలని అంటున్నారు ప్రజలు. గతంలో నుండి కూడా డిసెంబర్ 7వ తేదీన బిల్లు పార్లమెంటుకు వస్తుందని చెబుతున్న బలరాం నాయక్ మాటల్లో ఎంత వరకు నిజముందో మరో కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles