Digvijaya justifies hyderabad as joint capital

Digvijaya justifies Hyderabad as joint capital, Hyderabad as joint capital, congess party, telangana issue, seemandhra leaders,

Digvijaya justifies Hyderabad as joint capital

ఉమ్మడి రాజధానే అంటున్న దిగ్విజయ్

Posted: 11/27/2013 12:56 PM IST
Digvijaya justifies hyderabad as joint capital

రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ పై ఈరోజు మాట్లాడటం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ప్రజలు హైదరాబాద్ లేని తెలంగాణ వద్దు, ఒకవేళ్ల ఉమ్మడి రాజదాని అయితే రెండు సంవత్సరాలే చాలు అని అంటున్నారు. కేంద్రం మంత్రి సీమాంద్రకు, తెలంగాణ కు ఉమ్మడి రాజధానికిగా పది సంవత్సరాలైన ఉండాలని అంటుంది. కేంద్ర ప్రతిపాదనకు తెలంగాణ నేతలు అడ్డుతగులుతున్నారు. అయితే రాష్ట్రం పై పుల్ కసరత్తు చేసిన దిగ్విజయ్ సింగ్ రాజ్యాంగ పరిధికి లోబడి హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేస్తామని చెప్పారు. ఆ అవకాశం రాజ్యాంగంలో ఉందని తెలిపారు. ఉమ్మడి రాజధానికి రాజ్యాంగ సవరణ అవసరంలేదన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సంబంధించి ఆంటోని కమటీ సీఫార్సులు జిఓఎంకు అందించినట్లు తెలిపారు.

 

జిఓఎం ఈ రోజు నివేదిక సిద్ధం చేస్తుందని చెప్పారు. అన్ని అంశాలను జిఓఎం పరిశీలిస్తుందన్నారు. జిఓఎం నివేదిక కేంద్ర మంత్రి మండలి మందుకు వస్తుందని చెప్పారు. తెలంగాణ బిల్లు త్వరలో అసెంబ్లీకి ముందుకు వస్తుందన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని దిగ్విజయ్ చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేయడంలో తప్పులేదన్నారు. అధిష్టానం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గౌరవిస్తారని చెప్పారు. సిడబ్ల్యూసి నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. అంటే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని గా చెయ్యటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles