నిన్నటి వరకు నేను సమైక్యాంద్ర కోసం పోరాటం చేస్తున్న అని చెప్పిన ఎంపి రాయపాటి సాంబశివరావు. ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడు. సమైక్యాంద్ర ఉద్యమంలో రాజకీయ నాయకులు పాల్గొన్నాలి అని పిలుపునిచ్చిన రాయపాటి ఇప్పుడ కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. సమైక్యం కోసం రాజకీయ పదవులను సైతం వదులుకోవటానికి ఇష్టపడిన రాయపాటి ఇప్పుడు రాష్ట్ర విడిపోతే మాత్రం తప్పనిసరిగా ఈ డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం తీర్చాలిందేనని అంటున్నారు. రాష్ట్రం సమైక్యాంగా ఉంటే ఒకే. లేకపోతేమాత్రం సీమాంద్రకు గుంటూరును రాజధాని చేయాలని రాయపాటి డిమాండ్ చేస్తున్నారు. తాను ఇప్పటికీ సమైక్యవాదినే అని విభజన జరిగితే గుంటూరు రాజధాని కావాల్సిందేనని చెప్పారు.
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వల్ల రెండు రాష్ట్రాలు ఎడారి అయ్యే ప్రమాదముందన్నారు. మంగళగిరిలోసూపర్ స్పెషాలిటీ వస్తుందనుకుంటే రోశయ్య అసమర్థత ఫలితంగా అది సాధ్యం కాలేదని విమర్శించారు. సీమాంద్ర నాయకులు ఒక తాటిమీద లేకపోవటంతో.. సోనియా గాంధీ తన ఇష్టం వచ్చినట్లు తెలుగు ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటుంది. కొంతమంది సీమాంద్ర నాయకులు హైదరాబాద్ ను యూటి చేయ్యాలని కోరుతున్నారు. మరికొందరు రాయల తెలంగాణ కావాలని సోనియా గాంధీని అడుగుతున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇలా సీమాంద్ర నాయకుల దారులు అడ్డదిడ్డంగా ఉండటంతో.. ఆంద్ర నాయకులు, తెలుగు ప్రజలు అంటేనే ఢిల్లీ పెద్దలకు చులకన బావం ఏర్పడందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రం విడిపోతే.. ఒకరు గుంటూరు రాజదాని, మరొకరు కర్నూల్, ఇంకొకరు వైజాగ్ లను రాజదాని చేయ్యాలనే దానిపై పోటీ పడుతున్నారు గానీ , తెలుగు ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకులే కరువయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more