Telangana mps complain to sonia against kiran

telangana mps complain to sonia against kiran, Telangana MPs to complain against Kiran, Telangana Congress MPs, congress party, congress high command, sonia gandi, ap bifurcation, cm kiran meeting in vijayawada, cm kiran fire on congress high command, telangana isuse,

telangana mps complain to sonia against kiran, Telangana MPs to complain against Kiran

కిరణ్ పై సోనియాకు నివేదిక?

Posted: 12/09/2013 01:39 PM IST
Telangana mps complain to sonia against kiran

రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంద్ర కోసం దూకుడు పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటికి వరకు నల్లారి కిరణ్ హైకమాండ్ కు ఎన్నో సార్లు రాష్ట్ర విభజన వల్ల వచ్చే నష్టాలను వివరించటం జరిగింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాటలను పట్టించుకోకుండా.. కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర విభజన పై తుఫాన్ వేగంతో ముందుకు పోతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన పై కేంద్రం ఆమోద ముద్ర పడింది.

 

దీంతో నల్లారి వారిలో.. ఆగ్రహం కట్టలు తెంచుకొని విజయవాడ సభలో కాంగ్రెస్ హైకమాండ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై విమర్శల వర్షం కురింపించారు. అంతేకాకుండా.. ఢిల్లీలోని అమ్మకు సిఎం కిరణ్ పై ఒక నివేదిక తయారు చేసి ఈరోజు అమ్మకు సమర్పించారు. విజయవాడ సభలో సీఎం కిరణ్ చేసిన ప్రసంగంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం సభకు సంబంధించిన పూర్తి సమాచారం ఉందని సోనియాకు వారు వివరించారు.

 

అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని విజయవాడ సభలో కిరణ్ అన్నారు. సమైక్య ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంటే ఢిల్లీ పెద్దలు కళ్ల మూసుకున్నారా అంటూ విరుచుకుపడ్డారు. సోనియాను పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఎంపీలు మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్ కలిశారు. విభజనకు బిల్లుకు కేబినెట్ నిర్ణయం తెలిపిన తర్వాత తెలంగాణ నెలకొన్న రాజకీయ పరిస్థితిని సోనియాకు వారు వివరించారు. అయితే తెలంగాణ నాయకులకు సోనియా గాంధీ ఎలాంటి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles