ఈరోజు అసెంబ్లీ సమావేశంలో.. రాజకీయ నాయకుల మద్య హాట్ హాట్ మాటల యుద్దం జరిగింది. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు తెలంగాణ బిల్లు ఢిల్లీ నుండి హైదరబాద్ కు తీసుకువచ్చిన తీరుపై మండిపడ్డారు. కేవలం కేంద్రం ప్రభుత్వం తెలుగు జాతి పై కక్ష కట్టిందని అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు తెలంగాణ బిల్లును యుద్ద విమానంలో తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం తెలుగువారిపై యుద్దం చేస్తుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు మండిపడ్డారు.
తెలంగాణ బిల్లు ను ఎలా తెస్తే చంద్రబాబు ఎందుకు? చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ రాసినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అలాంటిది తెలంగాణ బిల్లు విమానం లో వస్తే తప్పేంటి? అని చంద్రబాబును ప్రశ్నించారు. అయిన తెలంగాణ బిల్లును విమానంలో కాకపోతే ఎడ్లబండిలో తీసుకువస్తారా అంటూ చంద్రబాబును హరీష్ రావు వెటకారంగా ప్రశ్నించారు.
అయిన చంద్రబాబు గత చరిత్ర మరిచి మాట్లాడుతున్నాడని హరీష్ రావు అన్నారు. గతంలో చంద్రబాబు మామ ఎన్టీఆర్ కు వెన్ను పోటు పొడిచినప్పుడు అసెంబ్లీ స్పీకరుని తుని నుంచి హెలికాఫ్టర్లో తీసుకురాలేదా లేకుంటే ఆ సంగతి మరిచిపోయావా అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. చంద్రబాబుకు ఓ విధానం అంటూ లేదని ఆయన ఆరోపించారు.
వైఎస్ ఆర్ పార్టీ సమైక్యాంధ్ర అంటే చంద్రబాబు కూడా సమైక్యాంధ్ర అంటూ వారిని కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పార్టీ తోక పార్టీగా మారిందని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఇద్దరి వ్యంగ్యస్త్రాలతో సభలో కొద్ది చేపు నవ్వులు పూసాయి. అయిన చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థం కావటంలేదు. ఇప్పుడు తెలంగాణ బిల్లు అసెంబ్లీకి చేరుకోవటం పై ఎందుకు రచ్చ రచ్చ చేస్తున్నాడో టిడిపి నాయకులకే అర్థంగాక .. జుట్టు పీకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more