2014 ap assembly elections to be postponed

AP Assembly elections, 2014 AP Assembly elections, 6 months post poned, congress high command, congress party, Parliament elections, lok pall bill, Rajyasabha,

2014 AP Assembly elections to be postponed 6 months.

కిరణ్ మరింత కాలం పదవిలో ఉండొచ్చు

Posted: 12/18/2013 10:28 AM IST
2014 ap assembly elections to be postponed

2014ఎన్నికల లోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకియ పూర్తి అవుతుందని, ప్రత్యేక రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు ఎప్పటి నుండో చెబుతున్నారు. అందుకు తగ్గట్లు గానే అధిష్టానం కూడా తెలంగాణ ప్రకియను సూపర్ ఫాస్ట్ వేగంతో ముందుకు కదుపుతుంది.

రాష్ట్రపతి ఆమోదం పొంది, అసెంబ్లీకి వచ్చిన తెలంగాణ బిల్లు పై చర్చ జరిగి, తిరిగి రాష్ట్రపతి చేరుకొని పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టి,అక్కడ ప్రక్రియ పూర్తవ్వడానికి సమయం పడుతుంది. ఈలోపు లోక్ సభ, శాసనసభ ఎన్నికల గడువు ముంచుకొస్తుంది కాబట్టి ఈ పక్రియ పూర్తయ్యే వరకు కేంద్రం మన రాష్ట్రంలో ఎన్నికలను ఆరు నెలల పాటు వాయిదా వేసే ఆలోచన చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈలోపు విభజన ప్రక్రియను పూర్తి చేసి ఆ తరువాత రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తుందన్న మాట.

మొదట సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగవచ్చని ప్రచారం జరిగినా ఇప్పుడు లోక్ సభకు మాత్రం ఎన్నికలు జరిపి ఆంధ్రప్రదేశ్ లో టి. ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ఎన్నికలను ఆలస్యం చేయవచ్చని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కేంద్రం ఈ ఆలోచనను అమలు చేస్తే మరికొన్ని రోజుల పాటు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగచ్చు. అలానే జరగాలని కోరుకుంటున్నాడేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles