Aap explains why it accepted congress support

AAP explains, Delhi polls, Delhi elections, Arvind Kejriwal, Aam Aadmi Party, AAP,

Arvind Kejriwal Aam Aadmi Party, which yesterday staked claim to form government in Delhi, has released a video on YouTube in seven languages explaining why they went ahead and formed.

కాంగ్రెస్ తో పొత్తు పై కేజ్రీవాల్ క్రేజీగా

Posted: 12/24/2013 08:29 PM IST
Aap explains why it accepted congress support

సామాన్య ప్రజల పార్టీగా ఆవిర్భవించి, పొటీ చేసిన మొదటి సారే ఇరవైఎనిమిది సీట్లను గెల్చుకోవడమే కాకుండా, ఢిల్లీలో పెద్దల్ని చీపురుతో ఊడ్చేసిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ ’ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దం అవుతున్న విషయం తెలిసిందే. అవినీతిని అంతం చేయడానికి ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ అదే అవినీతి పార్టీ అయిన కాంగ్రెస్ మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడంతో కొంత మంది అసహనం వ్యక్తం చేశారు.

అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లో ఓ యూట్యూబ్ మీడియో ద్వారా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మళయాళం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో రూపొందించారు. మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకోవడం, కాంగ్రెస్ లేదా బీజేపీ దానికి మద్దతివ్వాలంటే తాము పెట్టిన షరతులు.. అన్నింటినీ ఆ వీడియోలో వివరించారు. ''మేం ప్రభుత్వం ఏర్పాటుచేయాలా అని ప్రజలను అడిగాం. మాకు రెండు రకాల సమాధానాలు వచ్చాయి.

ఒకటి కాంగ్రెస్, బీజేపీ రెండింటికీ దూరంగా ఉండమని, రెండోది ప్రభుత్వం ఏర్పాటుచేసి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని'' అంటూ ఆ వీడియో మొదలవుతుంది. ఇప్పటికీ తమది మైనారిటీ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్ , బీజేపీ రెండూ ప్రతిపక్షంలోనే ఉన్నాయని చెప్పేలా ఓ బొమ్మ కూడా చూపించారు. కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్గంలో భాగస్వామ్యం లేదని, అది ప్రభుత్వంలో కూడా భాగం కాదని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles