Special schemes for girls and women by chandrababu

Special schemes for girls and women by Chandrababu, TDP Mahalakshmi scheme, Bangarutalli scheme, DWCRA groups, Loans to DWCRA groups

Special schemes for girls and women by Chandrababu

ఆడపిల్లలకు, మహిళలకు చంద్రబాబు వరాలు

Posted: 01/05/2014 09:44 AM IST
Special schemes for girls and women by chandrababu

అన్ననవుతా ఆడపిల్లలను కాపాడుతా అనే ప్రత్యేక పథకాన్ని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

తెదేపా అధికారంలోకి వస్తే తీసుకునిరానున్న పథకాన్ని చంద్రబాబు ఎన్టీ ఆర్ భవన్ లో డ్వాక్రా మహిళలకు వివరించారు.  కుటుంబంలో ఒక అన్న లాగా మహిళల అవసరాలను కనిపెట్టి వాటికనుగుణంగా పనిచేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

తెలుగుదేశం పార్టీ మహాలక్ష్మి పథకాన్ని ప్రకటించినదానికి పోటీగా ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని తీసుకునివచ్చిందని కానీ అందులో ఎన్నో ఆంక్షలను విధించి అసలు ఉద్దేశ్యాన్ని నీరుకారుస్తోందని చంద్రబాబు వాపోయారు.  కొత్తగా పుట్టే ఆడపిల్లలే కాకుండా ఇంతకు ముందు జన్మించిన ఆడపిల్లల విషయంలో కూడా పథకం వర్తించేట్టుగా చేస్తామని ఆయన అన్నారు. 

ఇక మహిళల విషయానికొస్తే మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం నెలకొల్పటానికి డ్వాక్రా పథకాన్ని తెదేపా ప్రారంభిస్తే ప్రభుత్వం వాళ్ళని అప్పులలో మునిగేట్టుగా చేసిందని అన్నారు చంద్రబాబు.  తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా ఋణాలన్నిటినీ మాఫీ చెయ్యటమే కాకుండా కొత్త ఋణాలను కూడా ఇస్తామని చంద్రబాబు మహిళలకు మాటిచ్చారు. 

బెల్ట్ షాపులను రద్దు చెయ్యటంతో పాటుగా వ్యసనాల వలన ఇంటి పెద్ద చనిపోయి పిల్లలను అనాధలను చేసిన సందర్భంలో ఆ పిల్లలను ఆదుకుంటామని కూడా చంద్రబాబు అన్నారు.  ఇంకా పరిశుభ్రమైన నీరు, వంట గ్యాస్ ధరల తగ్గింపు లాంటి వరాలనెన్నిటినో ప్రకటించిన చంద్రబాబు నాయుడు అవన్నీ చెయ్యటానికి తనకి అవకాశమివ్వమని అందరినీ కోరారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles