Aap continues protest second day

AAP continues protest second day, Aam Admi Party, Arvind Kejriwal, Delhi Police, Law Minister Somnath Bharti

AAP continues protest second day

కేజ్రీవాల్ ఆందోళనతో ఢిల్లీలో దిగ్బంధం

Posted: 01/21/2014 08:43 AM IST
Aap continues protest second day

కనీవినీ ఎరుగని రీతిలో ఆవిర్భవించిన అనతికాలంలోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సోమనాథ్ భారతి రాజీనామాకి పట్టుబడుతూ, పార్టీకి ఆందోళనలే కానీ ఆచరణలేమీ లేవా అంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలనెదుర్కుంటోంది.  న్యాయశాఖా మంత్రి మాట వినని ముగ్గురు పోలీసులను బర్తరఫ్ చెయ్యాలంటూ ఆందోళనకు దిగిన ముఖ్యమంత్రి ఆ విధంగా మరోసారి చరిత్రను తిరగరాసారు. 

అసలు గొడవంతా ఢిల్లీ పోలీసుల మీద ఆధిపత్యం ఢిల్లీ ముఖ్యమంత్రికి లేకపోవటం.  ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం కిందనే ఉంటారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించటం కుదరదని స్పష్టం చేసారు కేంద్ర హోంశాఖా మంత్రి సుశీల్ కుమార్ షిండే.  దానితో, ముందుగానే హెచ్చరించిన విధంగానే నిన్న ఢిల్లీలో ఆందోళనను చేపట్టిన కేజ్రీవాల్ ఈ రోజు కూడా ఆందోళనను కొనసాగిస్తున్నారు.

అయితే ఆందోళన మూలంగా ఢిల్లీ మంత్రుల పనులేమీ ఆగిపోలేదు.  ఆందోళన సాగిస్తున్న ప్రాంతానికే ఫైళ్ళను తెప్పించుకుని పనులు పూర్తి చేసుకుంటున్నారు. 

ఈ గొడవంతా మొదలైంది న్యాయశాఖామంత్రి సోమనాథ్ భారతి నిఘా వర్గాల సాయంతో విదేశీయులుంటున్న స్థావరాల మీద రైడ్ చేసి ఉగాండా నైజీరియాకి చెందిన నలుగురు మహిళలను వ్యభిచారం, మత్తు మందు సరఫరాలు చేస్తున్న నేరం మీద అరెస్ట్ చెయ్యటంతో. 

ఆఆపా చేస్తున్న ఆందోళన దృష్ట్యా పోలీసులు ఢిల్లీ నగరంలో వివిధ ప్రాంతాలలో బారికేడ్లు ఏర్పాటు చెయ్యటంతో ఢిల్లీ నగరవాసులు నానా కష్టాలు పడుతున్నారు.  ఆఆపా నిరంకుశంగా ప్రవర్తిస్తోందంటూ కాంగ్రెస్ నాయకులంతా ఎలుగెత్తి విమర్శలను గుప్పిస్తున్నారు.  ఆ మాట నిజమేనని, షిండేకోసమే ఇలా ప్రవర్తించాల్సి వస్తోందని కేజ్రీవాల్ అన్నారు.  అంతేకాదు తాను ఇదే విధంగా నిరసనలో కూర్చుని పదిరోజుల పాటు ఆందోళనను కొనసాగించటానికి కూడా సిద్ధమేనని కేజ్రీవాల్ ప్రకటించారు. 

అంతకు ముందు ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటం వలన ఈ సమస్య తలెత్త లేదు.  కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆఆపా కు చట్టాన్ని అమలుపరచటానికి అధికారాలు లేకపోవటం బాధను కలిగిస్తున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles