65th republic day celebrations

65th Republic Day Celebrations, President Pranab Mukherjee, Chidambaram, Sushil Kumar Shinde, 65th Republic Day Celebrations in Delhi, 65th Republic Day Celebrations in Hyderabad, Republic Day Celebrations 2014 Photos

65th Republic Day Celebrations

ఘనంగా జరిగిన గణతంత్ర వేడుకలు

Posted: 01/27/2014 09:19 AM IST
65th republic day celebrations

కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ గణతంత్ర వేడుకలు ఆదివారం నాడు అత్యంత ఘనంగా జరిగాయి. 

ఢిల్లీ రాజ్ పథ్ లో రాష్ట్రపతి ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలు అతిథులను ఆనందడోలికల్లో ముంచెత్తాయి.  ముఖ్యంగా సిపిడబ్ల్యుడి జవాన్ల మోటార్ సైకిల్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.  వివిధ రాష్ట్రాల విశేష ప్రదర్శనల వాహనాలు, పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు చూసి అతిథులు కరచాలనాలతో ఆనందాన్ని వ్యక్తపరచారు.

కాకపోతే ఈసారి ఢిల్లీలో వేడుకల సమయాన్ని బాగా కుదించటం జరిగింది.  భద్రతా సమస్యలను అధిగమించటానికే త్వరత్వరగా ముగించినట్లు తెలుస్తోంది.  ఈ సారి దూర్ దర్శన్ చేసిన విస్తృత ఏర్పాట్ల వలన, సాంకేతికంగా మెరుగైన హై డెఫినిషన్ కేమెరాలతో కవర్ చేసిన విధానం కూడా రాజ్ పథ్ కి వెళ్ళి చూడలేని వాళ్ళకోసం ఆ లోటుని తీర్చే ప్రయత్నం చేసినట్లుగా ఉంది.  ప్రతిసారీ మరో దేశ ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించే ఆనవాయితీ ఉన్న గణతంత్ర వేడుకలలో ఈ 65 వ గణతంత్ర వేడుకలలో జపాన్ ప్రధాని మంత్రి విచ్చేసారు.

వందలాది టెక్నిషియన్లతో కవర్ చేసిన సన్నివేశాలలో రాష్ట్రాల విశేష ప్రదర్శన వాహనాలు వెళ్తున్నప్పుడు కూర్చుని ఉన్న రాష్ట్రపతి పశ్చిమ బెంగాల్ ప్రదర్శన వాహనం వెళ్తున్నప్పుడు లేచి నిల్లుని చేతులు ఊపటాన్ని,  మహారాష్ట్ర వాహనం పోతున్నప్పుడు హోంమంత్రి షిండేని, తమిళనాడు వాహనం వెళ్తున్నప్పుడు చిదంబరాన్ని ప్రత్యేకంగా చూపించి తమ సమయస్పూర్తిని ప్రదర్శించారు.

రాష్ట్రంలో గాంధీభవన్ లో జరిగిన గణతంత్ర వేడుకలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ పాల్గొన్నారు.  అంతకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఎగుర వేసారు.  అక్కడ జరిగిన వివిధ సాంస్కతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles