తెలంగాణా రాష్ట్రం కోసం ఆందోళన చెందవద్దని, తాను రేపు ఢిల్లీకి పోతున్నానని, తిరిగి వచ్చేది తెలంగాణాతోనేనని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు తెలంగాణా ప్రాంత ప్రజలనుద్దేశించి మీడియా సమావేశంలో అన్నారు.
మెజారిటీతో రాష్ట్ర విభజన జరిగితే ఏ ఒక్క కొత్త రాష్ట్రమూ ఏర్పడివుండేది కాదని, శాసన సభ కేవలం అభిప్రాయం చెప్పటం కోసం మాత్రమే ఉందని, అందువలన రాష్ట్రం ఏర్పాటు చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉందని కెసిఆర్ అన్నారు.
ఇక ఇక్కడ పని పూర్తయిందని, రాష్ట్రంలో విభజన విషయంలో సంక్షోభం వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించవలసింది కేంద్రంలోనే కాబట్టి ఇక జరగవలసినదంతా ఢిల్లీలోనేనని చెప్పిన కెసిఆర్ పార్లమెంటులో ప్రవేశపెట్టేదే తుది బిల్లు అవుతుందని, అటువంటి తెలంగాణా రాష్ట్ర అవతరణ బిల్లుకి ఆమోదం తప్పక లభిస్తుందని ఆయన ధీమాను వ్యక్తపరచారు. అయితే ప్రస్తుత బిల్లులో ఉన్న కొన్ని లోపాల సవరణలను కూడా తాను అక్కడ ప్రతిపాదిస్తానని కూడా కెసిఆర్ అన్నారు.
బిల్లు మీద వాడి వేడి చర్చలు, ఆందోళనలు జరిగిన తర్వాత రాష్ట్రపతి గడువుని కూడా వారం రోజుల పెంచిన తర్వాత, మరో మూడు వారాల గడువు ఇంకా కావాలని కోరిన తర్వాత, ఈరోజు శాసనసభలో తెలంగాణా బిల్లుని తిరస్కరించటానికి ముఖ్యమంత్రి సభలో వేసిన తీర్మానం ఆమోదించబడింది. బిల్లంతా తప్పుల తడకని దానికి సాధికారత లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిల్లుని తిరస్కరించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు వారి స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించలేదని కెసిఆర్ విమర్శించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more