తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన బిల్లు మీద తను మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని ఆరోపించారు.
ఏదైనా చర్చ జరిగినప్పుడు సాధారణంగా ప్రతిపక్షనాయకుడికి ముందుగా మాట్లాడే అవకాశం ఇస్తారు, అలాగే ఇచ్చారు కూడా. కానీ ఆ సమయంలో ఆయన తర్వాత మాట్లాడతానని చెప్పారు. తర్వాత మొత్తం 86 మంది శాసన సభ్యులు బిల్లు మీద తమ అభిప్రాయాలను సభలో వెల్లడించారు. చివరగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఆ సమయంలో, ఆయన మాట్లాడిన తర్వాత తనకి సమయం ఇస్తామని తాను 27 న మాట్లాడవచ్చని ముఖ్యమంత్రి సభాపతి కూడా అన్నారని కానీ చివర్లో హడావిడిగా సభను వాయిదా వేసారని చంద్రబాబు అంటున్నారు.
ఢిల్లీ లో రాసిన స్క్రిప్ట్ ప్రకారమే కాంగ్రెస్, తెరాస, వైకాపా లు నడుచుకుంటున్నాయని చంద్రబాబు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.
విభజన బిల్లు విషయంలో జరిగిందంతా ప్రజాస్వామ్య స్పూర్తికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడ్డ చంద్రబాబు, బిల్లు సాధ్యమైనంత త్వరగా పార్లమెంటుకి పోవాలి అని రాష్ట్రపతి అనడంలో ఉద్దేశ్యమేమిటి, ఆయనకు ఆ అవసరమేమిటి అని ప్రశ్నించారు. ఆర్టికిల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించాలనే ఉద్దేశ్యంలోనే కేంద్రం ఉన్నట్లయితే అసలు బిల్లుని తయారు చేసి అసెంబ్లీకి పంపించవలసిన అవసరమేముందని ఆయన అడిగారు.
కాంగ్రెస్ ఆడుతున్న ఈ హై లెవెల్ డ్రామాను బట్టబయలు చెయ్యటానికి తాను ఢిల్లీ వెళ్తన్నానని, అక్కడ రాష్ట్రపతి, ప్రధానమంత్రిని, ఇతర నాయకులను కలిసి అంతా తేల్చివేస్తానని చంద్రబాబు అన్నారు. అలాగే బిల్లు మీద తన అభిప్రాయాలను నేరుగా రాష్ట్రపతికే అందజేస్తానని కూడా చంద్రబాబు అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more