రాష్ట్ర విభజన మీద న్యాయం చెయ్యమని, సరైన తీర్పు చెప్పమని కోరటానికి రాష్ట్ర నాయకులంతా హస్తినకు బయలుదేరారు.
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం తయారైన బిల్లు పాసవాలని తెలంగాణా నాయకులు, దాన్ని నిలిపివేయాలని సీమాంధ్ర నాయకులు ఢిల్లీకి క్యూకడుతున్న సందర్భంగా వారికోసం స్పెషల్ ఎయిర్ సర్వీసులు, రైలు సర్వీసులు మొదలవుతున్నాయి.
ఢిల్లీలో వీళ్ళంతా ఉండటానికి, తిరగటానికి బసలు, బస్సుల సర్వీసులను అందుబాటులోకి తేవటానికి ప్రైవేట్ వ్యాపారులు పోటీలు పడుతున్నారు. రాజకీయ షటిల్ సర్వీసులలో ఏ రోజైనా నాయకులు ఢిల్లీకి పోవచ్చు, తిరిగి రావొచ్చు వాళ్ళకి రిజర్వేషన్ తో పనిలేదు. పార్టీ నాయకత్వం నుంచి గుర్తింపు కార్డ్ లు ఉండాలి. కాకపోతే సర్వీస్ ఛార్జీలే దండిగా తీసుకుంటారు. కనీసం 20 శాతం అదనం. కానీ రాజకీయ నాయకులకు రాచమర్యాదలుంటాయి. స్పెషల్ ఆంధ్రా తెలంగాణా మెనులుంటాయి.
ఇక ఆందోళనలో పాల్గొనే కార్యకర్తలకోసం ఢిల్లీలో ఆందోళన చేసే స్థలానికి తీసుకెళ్ళటానికి బసలకు తీసుకుని రావటానికి బస్సులు, కార్లు, కాస్త ఎక్కువ ఛార్జ్ చేసినా అందుబాటులో ఉంటాయి. అందులోనే మంచినీళ్ళు బిరియానీ పులిహార ప్యాకెట్లుంటాయి. తలనొప్పి మాత్రలు, కడుపునొప్పి మాత్రలు, బిపి మాత్రలు, ఇతర సాధారణంగా వేసుకునే మాత్రలతో పాటు క్రీడారంగంలో వాడే నొప్పి నివారణ స్ప్రేలు కూడా ఉంటాయి- పొరపాటున పోలీసు లాఠీ తగిలినా లేక తప్పించుకోవటానికి పరిగెత్తటంలో కిందపడి దెబ్బలు తగిలినా కాసేపట్లో మళ్లీ ఆందోళనలో పాల్గొనటం కోసం. ఫొటోగ్రాఫర్లు తయారుగా 24 గంటల సేవలో ఉంటారు.
ఫోన్ నంబర్లను రిజస్టర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు టెక్స్ట్ మెసేజ్ ల ద్వారా గంటకో ప్రకటన చేసే ఢిల్లీ పెద్దల మాటలు తెలియజేయబడతాయి. ఇవి కాకుండా వైరి పక్షాల ఎత్తులను ఎప్పిటికప్పుడు చేరవేస్తూ పై ఎత్తులకు అవకాశం కల్పించే వేగులుంటారు.
తెరాస పార్టీ నాయకులు, తెదేపా నాయకులు ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు సోమవారం చేరుకోబోతున్నారు. ఫిబ్రవరి 7 న ఏమవుతుంది, 11 న ఎలా జరుగుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. అందరినీ తృప్తి పరచే మంత్రమైతే కాంగ్రెస్ పార్టీ దగ్గర కనపడటం లేదు. అందువలన ఏ నాయకులు ఏ వార్తలతో తిరిగి వచ్చి నీరాజనాలందుకుంటారోనని వివిధ పార్టీ ల ఖండువాలు, హారతి పళ్ళేలు తయారు చేసుకుంటున్నాయి సేవాసంస్థలు.
ఈ సేవలన్నిటికీ టోకున, సమగ్రంగా చేసే సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ఇక రాజకీయ నాయకులు రంగంలోకి దూకటమే తరువాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more