Cm kiran kumar explains power of his resolution in assembly

CM Kiran Kumar explains power of his resolution, Kiran Kumar resolution in Assembly, AP State reorganization Bill 2013, Telangana Bill, Digvijay Singh

CM Kiran Kumar explains power of his resolution in Assembly, AP State reorganization Bill 2013

మరోసారి ముఖ్యమంత్రి వినిపించిన సమైక్య గళం

Posted: 02/03/2014 09:54 AM IST
Cm kiran kumar explains power of his resolution in assembly

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తను శాసనసభలో చేసిన తీర్మానం గురించి వివరిస్తూ, అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్, తెరాసల ఎత్తుగడలకు ప్రతిగా బ్రహ్మాస్త్రమని అన్నారు.  తన తీర్మానాన్ని తెల్లకాగితమని, అది చెల్లదని, తొండివాదమని అన్న వాళ్ళకు సమాధానంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆ మేధావులు చెప్పింది సరికాదని, అది బ్రహ్మాస్త్రమేనని వాదించారు.

అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుని ఓడించటానికి తెలుగుదేశం వైకాపా పార్టీలు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ ఆ పార్టీలు ఢిల్లీలో కూడా అదేవిధంగా బిల్లుని ఓడించటానికి కలిసికట్టుగా పనిచెయ్యాలని కోరారు.  స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడ్డ ఏ కొత్త రాష్ట్రమూ శాసనసభ తీర్మానం లేకుండా జరగలేదని గుర్తుచేస్తూ, తలపండిన మేధావులే మూజువాణి వోటుకి విలువ లేదని అనటం సరికాదని అన్నారాయన.  తెలుగు ప్రజల ఆత్మాభిమానం, తెలుగు రాష్ట్రంకోసం, తెలుగు జాతికోసం చేసిన త్యాగాలు, ప్రజల అభిమానం ఆ తీర్మానంలో దాగున్నాయని చెప్పిన కిరణ్ కుమార్, ఎన్నికలు రాబోతున్నాయి కనుక రాష్ట్ర విభజన విషయాన్ని తెలుగు ప్రజలకే వదిలెయ్యండని అన్నారు. 

తీర్మనం తెల్లకాగితంతో సమానమైతే తీర్మానం జరిగిన వెంటనే దిగ్విజయ్ సింగ్, ఇతర నాయకులు ఎందుక స్పందించారని ప్రశ్నించారు కిరణ్ కుమార్. 

విభజన మీద రాష్ట్రపతికున్న సర్వహక్కులను గురించి మాట్లాడుతూ, విభజన బిల్లు మీద రాష్ట్రపతి పూర్తిగా తృప్తిచెందిన తర్వాతనే దాన్ని పార్లమెంటుకి పంపుతారని అన్నారు.  సలహాలు సూచనలకోసం న్యాయకోవిదుల సలహాలు తీసుకోవటమే కాకుండా సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని కూడా రాష్ట్రపతి తీసుకోగలరని ముఖ్యమంత్రి అన్నారు. 

ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పరవాలేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటానికే అందరూ పాటుపడాలని చెప్తూ కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి తన సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles