Kiran kumar reddy dharna at jantar mantar

Kiran Kumar Reddy Dharna At Jantar Mantar, Congress High Command, Shakti Sthal, Kiran Kumar Reddy protest, Telangana supporters

Kiran Kumar Reddy Dharna At Jantar Mantar

ముఖ్యమంత్రి వేదిక మారింది, వాడి పెరిగింది

Posted: 02/05/2014 09:39 AM IST
Kiran kumar reddy dharna at jantar mantar

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందుగా అనుకున్నట్టుగా ఇందిరా గాంధీ సమాధి శక్తి స్థల్ లో మౌనదీక్ష కాకుండా వేదికను జంతర్ మంతర్ కి మార్చారు.  శక్తి స్థల్ లో మరమ్మతులు జరుగుతుండటం వలన వేదికను మార్చటంతో జాతీయ మీడియా దృష్టి కూడా ఆయన మీద పడబోతోంది. 

కాంగ్రెస్ చరిత్రలో మొదటిసారిగా అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పిన ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్రులకు హీరోగా పేరు తెచ్చుకున్నారు.  ఏకపక్షంగా నిరంకుశ విధానంలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మొండిగా ముందడుగు వేస్తున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జంతర్ మంతర్ లో ఈరోజు ధర్నా చేస్తున్నారు. 

ఇంతకు ముందు తెలంగాణా నాయకులు ఈ ఆందోళనకు పోటీగా తమ ఆందోళనలను ప్రదర్శిద్దామను అనుకున్నారు కానీ కాంగ్రెస్ అధిష్టానం అందుకు అడ్డు చెప్పింది.  ఢిల్లీలో వీధి పోరాటాలకు దారితియ్యవద్దని కోరింది.  దానితో వాళ్ళు ఆగిపోయారు. 

ఇప్పటికే ఆంధ్రుల గుండెల్లో సాహసోపేతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఈ ధర్నాతో జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు సీమాంధ్రలో మంచి గుడ్ విల్ కూడా దక్కించుకోబోతున్నారు.  చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి సీమాంధ్రలో సంపాదించుకున్న పేరుకు గండి కొట్టటానికి కిరణ్ కుమార్ ధర్నాను అధిష్టానం ఉపయోగించుకుంటుందా అన్న రాజకీయ విమర్శకులు, విశ్లేషకుల అంచనాలకు కాంగ్రెస్ అదిష్టానం ధోరణి ఊతమిస్తోంది. 

మొత్తం కాంగ్రెస్ వ్యూహానికే అడ్డుతగులుతున్న కాంగ్రెస్ నాయకుడిని నిలువరించటం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద పనేం కాదు.  కనీసం ఆయన ధర్నాకు అడ్డుపడుతున్న తెలంగాణా నాయకులను ఆపకుండా ఉన్నా సరిపోతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles