అధిష్టానం పిలుపు మేరకు ప్రధాన మంత్రి, సోనియా గాంధీ ఇతర క్యాబినెట్ మంత్రుల సమక్షంలో జరిపిన సమావేశంలో హాజరైన ముఖ్యమంత్రిది ఫలప్రదమైన కల.
కళ్ళజోడు పైనుంచి చూస్తూ, "ఇంతకీ మీకేం కావాలి?" అని అడిగారు సోనియా గాంధీ కిరణ్ కుమార్ ని.
"నేనెప్పటికీ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రుడిని.... "
"అదంతా సరే, ఇప్పుడు మీరు కోరుకునేదేమిటి?" చిరునవ్వుతో అడిగారు సోనియా.
"ఫైనల్ గా మీరేం చెప్తే అదే....."
"మరదే...", అన్నారు దిగ్విజయ్ సింగ్ అందుకుని. "అడిగినపుడు చెప్పరు తర్వాత దీక్షలు చేపడతారు."
"అంటే.... రాష్ట్రం విభజిస్తే పార్టీకి నష్టం జరగతాది, మనం ఇష్టమొచ్చినట్లుగా విభజించేందుకు లేదు... "
"మేమేం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు?" మళ్ళీ ఓపిగ్గా అడిగారు సోనియా గాంధీ.
"రెండు ప్రాంతాలకు న్యాయం చెయ్యాల..."
"రాష్ట్రాన్ని విభజించాలంటారా వద్దంటారా."
"నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా?" పాతాళభైరవి లో ఎన్టీఆర్ శైలిలో నమ్రతగా అడిగారు కిరణ్ కుమార్
"నిజవేఁ చెప్తా పోలే!" అన్నారు సుశీల్ కుమార్ షిండే పక్కా రాయలసీమ యాసలో. దాన్ని గమనించని కిరణ్ కుమార్,
"కలపి వుంచినట్లయితే లాభమే కలగతాది కాని, తెలంగాణా ఉద్రేకాలు చూస్తావంటే చాలా బయంగా ఉందబ్బా" అన్నారు కిరణ్ కుమార్.
"అయితే ఒక పని చేద్దాం... రాష్ట్రాన్ని విభజించకుండానే తెలంగాణా ఇచ్చేద్దాం" అన్నారు సోనియా గాంధీ.
"ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నువ్వే ముఖ్యమంత్రబ్బా! తెలంగాణాకేమొ కెసిఆర్ ముఖ్యమంత్రి!" అన్నారు దిగ్విజయ్ సింగ్.
"రాజధాని మాట...."
"వస్తావన్నానబ్బా... ఆడికే వస్తావన్నా. హైద్రాబాద్ రాజధాని. ఆగు పూర్తిగా చెప్పనీవయ్యా.. భవనాలు కట్టేంత వరకు రాత్రి పన్నెండు గంటలనించి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అది తెలంగాణది, ఆతర్వాత సమయంలో ఆంధ్రప్రదేశ్ ది. ఇండియాకి రాజధాని ఢిల్లీ అయితే అందులో ఢిల్లీ శాసన సభ కూడ ఉండ్లే? అట్లనే ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం ఉంటది. వాళ్ళ ఉద్యోగాలు, నీళ్లు అన్నీ వాళ్ళవే. మీ ఉద్యోగాలు, నీళ్ళు అన్నీ మీవే. ఎట్టాగుంది?"
"బాగానే వుంది కానీ పూర్తిగా అవగతం కాలే....."
"నాకూ అంతే.. అదే.... నేను చెప్పొచ్చేదేంటంటే నీ మాటా చెల్లుద్ది, కెసిఆర్ మాటా చెల్లుద్ది. తెరాస కాంగ్రెస్ లో మెర్జవతది. దాంతో మన కాంగ్రెస్ పిల్లకాయలకు కూడా తెలంగాణాలో ఎడ్జెస్ట్ మెంట్ అయిపోద్ది...."
"సార్ క్యాబినెట్ మీటింగ్ కి టైమైంది" అన్న మాటలతో ఉలిక్కిపడి లేచారు కిరణ్ కుమార్.
"నిన్న మౌన దీక్ష, తరవాత ఆలోచనలు బుర్ర బరువెక్కి నీరసంగా ఉండి కునుకుపట్టింది. ఇదిగో ఇప్పుడే తయారౌతా" అన్నారు కిరణ్ కుమార్.
అప్పుడర్థమైంది ఆయనకి సోనియా గాంధీతో పాటు షిండే, దిగ్విజయ్ లు కూడా తెలుగులో చక్కగా ఎలా మాట్లాడారో.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more