Hyderabad can become ut

Hyderabad can become UT, AP State reorganization bill 2013,Congress Party, Opposition party BJP, State opposition party TDP

Hyderabad can become UT, AP State reorganization bill 2013

కేంద్రపాలితమయ్యే అవకాశం మెండుగా ఉన్న హైద్రాబాద్ నగరం

Posted: 02/07/2014 09:34 AM IST
Hyderabad can become ut

ఇప్పటి వరకు రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్రుల ఆందోళనలను పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఇక కొంతైనా తగ్గక తప్పదనుకుంటున్నట్టు కనిపిస్తోంది.  అందుకు కారణం ఒకటి కాదు.  సొంత పార్టీ నాయకుల నుంచే వస్తున్న వ్యతిరేకత, సుప్రీం కోర్టు వరకు వెళ్ళిన విభజన పేచీ, కేంద్రం పంపిన విభజన బిల్లును శాసనసభ తిరస్కరించటం ఇత్యాది విషయాలతో పాటు వీటన్నిటినీ కేంద్రంలో ప్రతిపక్షమైన భాజపా, రాష్ట్రంలో ప్రతిపక్షమైన తెదేపా రాజకీయ లబ్ధి కోసం మలుచుకునే ప్రయత్నం కనిపించటం, అందులో భాగంగా ఆ రెండు పార్టీలు దగ్గరవుతుండటం కాంగ్రెస్ పార్టీని ఒకింత ఆలోచింపజేసేట్టుగా చేసాయి. 

ఇంతా చేసి తెలంగాణాలో హీరో అవుతున్నది తెరాస పార్టీ అధ్యక్షుడు కెసిఆర్.  అయితే ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన విషయంలో తగ్గటమైతే కూడని పని.  పార్టీకి చాలా చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సీమాంధ్ర నాయకులను మంచి చేసుకోవటానికి ప్రయత్నిస్తోంది అధిష్టానం. 

అందువలన అంతా అయిపోయింది, పార్లమెంటులో పెట్టటమే అన్న రాష్ట్ర విభజన బిల్లు మీద సీమాంధ్ర నాయకుల సూచనల మేరకు సవరణలు చెయ్యటానికి సిద్ధపడుతూ ఇప్పటికి మూడు సార్లు జివోఎమ్ సమావేశం తర్వాత ఈ రోజు నాల్గవసారి మళ్ళీ సమావేశమవబోతోంది. 

అందిన సమాచారం ప్రకారం విభజన బిల్లు ముసాయిదాలో కాంగ్రెస్ పార్టీ చెయ్యబోతున్న సవరణలలో ప్రముఖంగా హైద్రాబాద్ నగరాన్ని 10 సంవత్సరాల కాలం వరకు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంది.  సీమాంధ్ర నుంచి ముఖ్యంగా హైద్రాబాద్ ని వదులుకోవటమే అభ్యంతరంగా కనిపిస్తుండటం వలన కొత్త రాజధాని తయారయ్యేంత వరకూ 10 సంవత్సరాల గరిష్ట కాలం వరకు హైద్రాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే దాన్ని తెలంగాణాకి ఇచ్చేసారనే మనస్తాపం తగ్గే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles