ప్రపంచ స్థాయిలో వ్యాపార రంగంలో కొత్త కొత్త విధానాలకు శ్రీకారం చుడుతూ మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచిన 50 మంది అగ్ర స్థాయి వ్యాపారస్తులలో భారత దేశానికి చెందిన మహిళలు ఇద్దరున్నారు.
ఫార్చూన్ మేగజైన్ వెల్లడి చేసిన ఆ జాబితాలో పెప్సీ కంపెనీ సిఇవో ఇంద్రా నూయీ, ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి చందా కోచర్ ఉన్నారు. ఆ జాబితాలో పై స్థానాన్ని అలంకరించిన మహిళ జనరల్ మోటార్స్ లో సిఇఓ గా ఉన్న మేరీ బర్రా ఎలక్ట్రకిల్ ఇంజినీరు చేసి తన కెరీరంతా ఆ కంపెనీకే అర్పించారు. ఆమె ప్రపంచ వ్యాప్తంగా 212000 మంది ఉద్యోగులకు అధిపతి.
మూడవ స్థానంలో ఉన్న భారత దేశానికి చెందిన 58 సంవత్సరాల నూయీ గత ఏడు సంవత్సరాలుగా భారత దేశంలోని పెప్సీ కంపెనీలో పనిచేస్తూ అమ్మకాలను రెట్టింపు చేసారు. 65.5 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయంలో ఉన్న ఈ సంస్థలో ఇతర విదేశీ పానీయాల సంస్థలు కేవలం సగమే సాధించాయి.
ఇక 18 వ స్థానంలో ఉన్న భారతీయ మహిళ 52 సంవత్సరాల కోచర్, భారత దేశంలో 124 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన ఆస్తులు, 3588 శాఖలతో పనిచేస్తూ 1.5 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో దేశంలో రెండవ స్థానంలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ లో పనిచేస్తున్నారు. ఈ బ్యాంక్ మొత్తం 19 దేశాలలో శాఖలను విస్తరింపజేసి విదేశవాసుల భారతదేశంలోని కుటుంబ సభ్యులకు సొమ్ము బదిలీ చేస్తోంది.
ఏ రంగంలోనైనా మహిళలు విజయాన్ని సాధించగలరని నిరూపిస్తూ మహిళలకు స్పూర్తిదాయకంగా ఉన్న వీరిద్దరికీ అభినందలు వెల్లువెత్తుతున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more