Railway helpline for women safety

Railway helpline for women safety, women Helpline 1322, All India Railway helpline, Women protection in trains, All India helpline for women

Railway helpline for women safety, women Helpline 1322

రైళ్ళల్లో మహిళల భద్రతకు హెల్ప్ లైన్

Posted: 02/07/2014 03:48 PM IST
Railway helpline for women safety

రైళ్ళల్లో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా మహిళల భద్రత కోసం దేశవ్యాప్తంగా హెల్ప్ లైన్ ని ఏర్పాటు చేస్తోంది రైల్వే శాఖ. 

త్వరలోనే ప్రారంభించనున్న 1322 హెల్ప్ లైన్ నంబర్ ను 4.7 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నామని రైల్వే స్థాయీ సంఘం తెలియజేసింది.  ఈ హెల్ప్ లైన్ ని సుశిక్షితులైన బృందంతో ప్రొఫెషనల్ కాల్ సెంటర్ నిర్వహిస్తుంది.  ఇది ఒక డిజిపి, నలుగురు ఇన్స్ పెక్టర్ల పర్యవేక్షణలో నడుస్తుంది. 

బాధితులైన మహిళలు లేక ఆ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చి సాయపడదలచుకున్నవారు, ఈ హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి పోలీసు సహాయాన్ని పొందవచ్చు.  ఈ హెల్ప్ లైన్ ద్వారా సమాచారాన్ని రైలులో ఉన్న పోలీసులకు, ఆ రైలు ఆ సమయంలో ఉన్న సమీపంలోని రైల్వే స్టేషన్లో పోలీసు బలగాలకు అందజేయబడుతుంది. 

ప్రస్తుతం ఈ 1322 నంబరు గల హెల్ప్ లైన్ సేవల స్థాపన జరుగుతోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles