T ball in president court

T ball in President court, AP State Reorganization bill 2013, Kiran Kumar Reddy, Chief Minister resignation, Union Cabinet approves T Bill

T ball in President court, AP State Reorganization bill 2013

బంతి రాష్ట్రపతి కోర్టు నుంచి రానీండి- కిరణ్ కుమార్

Posted: 02/08/2014 08:32 AM IST
T ball in president court

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ వస్తున్నట్లుగానే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే ఆశాభావం, అలా ఉంచటానికి చివరివరకు పోరాడాతనని చెప్పినట్లుగానే ఆయన ప్రవర్తన కూడా కనిపిస్తోంది. 

క్యాబినెట్ ఆమోదం తెలిపిన రాష్ట్ర విభజన బిల్లు రాష్ట్రపతి కి పంపించటానికి సిద్ధమైంది.  ఇంకా అక్కడ నుండి కూడా రావాలి కదా అంటారు ముఖ్యమంత్రి.  నిన్న రాత్రి బిల్లు మీద యథాతథంగా ఆమోద ముద్ర వేసిన కేంద్ర ప్రభుత్వ చర్యకు ఆయన స్పందన ఎలా ఉంటుందా అని కొందరు నేతలు కలుసుకోగా, కిరణ్ కుమార్ అదేవిధంగా ఎప్పటిలాగానే నిదానంగా రాష్ట్రపతి దగ్గర నుండి రానీండి అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దామన్నది అని అన్నట్టుగా సమాచారం. 

ఏకపక్షంగా బిల్లుని అదే విధంగా పార్లమెంటులో ప్రవేశపెడితే పదవి నుంచి తప్పుకుంటానని అన్న కిరణ్ కుమార్ చెప్పిన దానిమీద ఆయనకు సన్నిహితంగా ఉండే నాయకులు ఆయనను కలిసారు.  ఆ సంగతి ఆయనకాని ఇతరులు కాని మర్చిపోకుండా ఉండేందుకు ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలంగాణా నాయకులు కూడా ఆ విషయంలో ఎత్తిపొడుపులకు దిగుతారు. 

విచిత్రమేమిటంటే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చెయ్యటానికే అనుకూలంగా బిల్లుని ఆమోదించటం జరిగింది.  అంటే ఆయన ఛాలెంజ్ చేసిన విధంగానే ఎటువంటి సవరణలు లేకుండా పార్లమెంటులో ప్రవేశపెట్టటానికి కేంద్రం సంసిద్ధమైంది.  32 సవరణలను పరిశీలించినా వాటిని బిల్లులో పొందపరచకుండా పార్లమెంటులోనే ప్రతిపాదించే ఆలోచనలో ఉంది కేంద్రం. 

ఈ బిల్లుని ఫిబ్రవరి 12 న రాజ్యసభలో ప్రవేశపెట్టటానికి సన్నాహాలు చేసుకుంది ప్రభుత్వం.  అంటే ఈ లోపులో రాష్ట్రపతి దగ్గర్నుంచి వస్తుందనే గట్టి నమ్మకం ఉంది.  శాసన సభకు పంపించినప్పుడూ కూడా కేంద్రం ఇలాగే ప్రవర్తించింది.  అనుకున్న సమయంలో రాష్ట్రపతి దాన్ని హోం మంత్రి కార్యాలయానికి పంపించటం అక్కడి నుండి నిజంగానే ఆఘమేఘాల మీద ప్రత్యేక విమానంలో బిల్లుని పంపించటం జరిగింది. ఈ సారి కూడా రాష్ట్రపతి ఏ విధమైన చర్య తీసుకుంటారన్న దానిలో కూడా కేంద్ర ప్రభుత్వానికి స్పష్టత ఉన్నట్లుగానే కనిపిస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles