Digvijay singh denies party action on kiran kumar

Digvijay Singh denies party action on Kiran Kumar, Kiran Kumar Reddy protection against party, Kiran Kumar goes against High Command plans, Digvijay Singh

Digvijay Singh denies party action on Kiran Kumar

అబ్బే, కిరణ్ తప్పేమీ లేదు అన్న దిగ్విజయ్ సింగ్

Posted: 02/08/2014 02:22 PM IST
Digvijay singh denies party action on kiran kumar

కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడి, నిరసనలు చేసి కేంద్రం పంపించిన బిల్లుని తిరస్కరించి ఇలా పార్టీ నిర్ణయాలకు కట్టుబడకుండా చెయ్యటం వలన ఆయన మీద అధిష్టానం కన్నెర్ర చేస్తుందని, పార్టీ పట్ల విధేయత చూపించనందుకు క్రమశిక్షణా రాహిత్యం కింద పార్టీ తరఫునుంచి చర్య తీసుకోవచ్చని అంచనాలు జరుగుతున్న సమయంలో పార్టీ ఛీఫ్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ కిరణ్ కుమార్ తరఫునుంచి తప్పేమీ జరగలేదని అనటం ఆశ్చర్యం కలిగించటంతో పాటు తెదేపా వైకాపాలు విమర్శించినట్లుగా ఆయన కేంద్ర రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నారా అనే అనుమానం రాకమానదు. 
ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పే హక్కు అందరికీ ఉందని దిగ్విజయ్ సింగ్ సమర్థించారు.  ఆయన అధిష్టానానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని ఆయన అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
పార్టీ చర్య తీసుకుని కిరణ్ కుమార్ ని తప్పిస్తుందా లేకపోతే ఆయనే రాజీనామా చేస్తారా, ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న ఆయన కొత్త పార్టీ ఊపిరిపోసుకుటుందా అని ఆత్రుతగా చూసేవారు చాలామంది ఉన్నారు.  కానీ ముఖ్యమంత్రి కూడా ఇంకా బిల్లు రాష్ట్రపతి నుండి పార్లమెంటుకి రావాలి కదా అప్పుడు ఆ సమయంలోని పరిణామాల దృష్ట్యా నా స్పందన ఉంటుంది అని తనకు సన్నిహితంగా ఉండే రాజకీయ నాయకులతో అన్నట్లుగా సమాచారం.
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles