T bill to go to loksabha first

T bill to go to Loksabha first, AP State Reorganization Bill 2013, State bifurcation bill to Loksabha first, Sate Bifurcation is money bill

T bill to go to Loksabha first, AP State Reorganization Bill 2013

తెలంగాణా బిల్లు ముందు లోక్ సభకే

Posted: 02/11/2014 12:03 PM IST
T bill to go to loksabha first

ముందు అనుకున్నట్లుగా కాకుండా రాష్ట్ర విభజన బిల్లు ముందు లోక్ సభకే రానుంది.  ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి నుంచి తాజా సూచనలు తీసుకోనుంది. (ఫోటోలో కేంద్ర హోంశాఖ కార్యాలయం)

ఈ బిల్లు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన బిల్లులోకి వస్తుంది కాబట్టి ఆర్టికిల్ 117(1) ప్రకారం దీన్ని పై సభలో ముందుగానే ప్రవేశపెట్టకూడదు.  రాజ్యసభ సెక్రటేరియట్ చేసిన ఈ సూచన మేరకు రాష్ట్ర విభజన బిల్లు ఇప్పుడు ముందుగా లోక్ సభలోనే ప్రవేశపెట్టబోతున్నారు.  ఈ విధంగా తెలంగాణా బిల్లును రాజ్యసభలో పెట్టి గట్టెక్కిద్దామనుకున్న ప్రభుత్వం మనసు మార్చుకోవలసివ్చింది.

ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖలోని ఒక సీనియర్ అధికారి తెలియజేస్తూ, రాజ్యసభలో ప్రవేశపెట్టటానికి వీలుగా బిల్లును ఆమోదించి పంపిన రాష్ట్రపతిని లోక్ సభలో ప్రవేశపెట్టమని సూచించమని అడుగుతున్నారని అన్నారు. 

రాష్ట్ర విభజనలో కన్సోలిడేటెడ్ ఫండ్ లోంచి నిధులను అప్రోప్రియేట్ చెయ్యవలసివుంటుంది కాబట్టి ఇది మనీ బిల్లులోకి వస్తుందని, అందువలన దీన్ని ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టరాదని రాజ్యసభ సెక్రటేరియట్ స్పష్టంచేసింది.

ఈ విషయాన్ని కోర్ కమిటీ మీటింగ్ లో చర్చించనున్నారు.  ఆర్ధిక మంత్రి చిదంబరం ఈ బిల్లు ఆర్దిక బిల్లు కాదని గట్టిగా వాదిస్తారట!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles