Congress leader attempts suicide protesing t bill

Congress leader attempts suicide protesing T bill, Congress leader East Godavari suicide attempt, Suicide attempt against T bill, AP State Reorganization Bill 2013, Congress party pressing T bill in Parliament

Congress leader attempts suicide protesing T bill

విభజనకు నిరసనగా కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్య?

Posted: 02/13/2014 10:52 AM IST
Congress leader attempts suicide protesing t bill

చచ్చి సాధించేది లేదని మన పెద్దలు అంటారు.  ఏం సాధించదలచుకున్నా బ్రతికుండే పోరాడాలి అని సూచిస్తారు. 

అయినా రాష్ట్ర విభజన విషయంలో ఆత్మహత్యలు జరిగాయి.  ఇటు తెలంగాణాలోను అటు సీమాంధ్రలోనూ మనస్తాపంతో ప్రాణాహుతికి పాల్పడటం కానీ లేదా హృద్వేగంతో మరణించటం కాని జరిగాయి.  అయితే నిన్నటి వరకు రాజకీయ నాయకులు ఆ సాహసానికి ఒడిగట్టలేదు. 

తూర్పు గోదావరి జిల్లాలో స్థానిక కాంగ్రెస్ నాయకుడు 45 సంవత్సరాల వయసుగల కె.శ్రీనివాస్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.  కాంగ్రెస్ నాయకుడు, బిసి లీడర్ శ్రీనివాస్ పార్టీ అడ్డగోలుగా చేస్తున్న రాష్ట్ర విభజన ప్రక్రియకు మనస్తాపం చెంది నిన్న రాత్రి 40 నిద్ర మాత్రలు మింగి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యారు. 

హాస్పిటల్ తీసుకెళ్లే ముందు శ్రీనివాస్ మాట్లాడుతూ లోప భూయిష్టమైన బిల్లును రాష్ట్రం మీద రుద్దుతున్న కాంగ్రెస్ పార్టీ అదేమిటని ప్రశ్నించిన ఆరుగురు పార్లమెంటు సభ్యులను బర్తరఫు చెయ్యటంతో మనసుకి కష్టమనిపించిందని చెప్పారు.  ఆయన కుటుంబ సభ్యులు కూడా తెలంగాణా బిల్లు విషయంలో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అన్నారు.

హాస్పిటల్ లో చికిత్స అనంతరం శ్రీనివాస్ ని డాక్టర్లు ప్రాణాలతో నిలబెట్టారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles