Sonia gandhi fixed dates for telangana

Sonia Gandhi fixed dates for Telangana, AP State Reorganization Bill, Rahul Gandhi, Sushil Kumar Shinde, Kamalnath, Union Minister Chidambaram

Sonia Gandhi fixed dates for Telangana, AP State Reorganization Bill

తెలంగాణాకు తిరుగులేని ముహూర్తం పెట్టిన సోనియా గాంధీ

Posted: 02/16/2014 11:49 AM IST
Sonia gandhi fixed dates for telangana

పార్లమెంటులో జరిగిన గందరగోళం, తెలంగాణా బిల్లు విషయంలో జరుగుతున్న జాప్యం విషయాల్లో తీవ్ర అసంతృప్తిని వెలబుచ్చారు సోనియా గాంధీ.  ఆమె ఆగ్రహానికి గురైనవారు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఆర్ధిక మంత్రి చిదంబరం, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమలనాధ్, స్పీకర్ మీరా కుమార్ అని తెలిసింది.

ఆరు నూరైనా నూరు ఆరైనా తెలంగాణా బిల్లు 18 న లోక్ సభలోనూ, 19 న రాజ్య సభలోనూ ఆమోదం పొందాల్సిందే.  అందుకు మీరేం చేస్తారో నాకు తెలియదు అని సోనియా గాంధీ గట్టిగా హెచ్చరించారు.  

దానితో పార్లమెంటులో పక్కా వ్యూహంతో ముందుకెళ్ళటం కోసం హోం మంత్రి షిండే, కమలనాధ్ లు చర్చలు సాగిస్తున్నారు.  నియంత్రణలో భాగంగా మంత్రులని కూడా చూడకుండా సభను సాగనివ్వనివారిమీద బహిష్కరణ వేటు వెయ్యాలని యోజనలు చేస్తున్నారు.  

ఎందుకంటే, బడ్జెట్, తెలంగాణా బిల్లే కాదు కాంగ్రెస్ ప్రతిష్టను పెంచి, అప్రకటిత ప్రధానమంత్రి అభ్యర్థి రాహల్ గాంధీ ప్రతిపాదించిన ఆరు అవినీతి నిరోధక బిల్లులు ఇంకా ఉన్నాయి.  వాటిని కూడా ఈ ఆఖరు సమావేశాలలో ఆమోదింపజేసుకుంటేనే ఎన్నికలలో అవి ప్రచార సాధనాలలో ఉపయోగపడతాయి.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles