Sushma swaraj on last day of last loksabha

Sushma Swaraj on last day of last Loksabha, Kamananath, Sushil Kumar Shinde, Manmohan Singh, BJP, Congress party

Sushma Swaraj on last day of last Loksabha

ఆఖరి పార్లమెంట్ ఆఖరు రోజున సుష్మా స్వరాజ్

Posted: 02/22/2014 09:01 AM IST
Sushma swaraj on last day of last loksabha

శుక్రవారం పార్లమెంట్ సమావేశంలో అందరి ఆవేశాలూ తగ్గిపోయి విభేదాలన్నీ మర్చిపోయి ఒకరినొకరు అభినందించుకున్నారు నాయకులు.

ఈ సందర్భంగా ప్రతిపక్షాల మీద తన వాగ్ధాటితో విరుచుకుపడే భాజపా సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ ఈ విధంగా అన్నారు-

15 వ లోక్ సభ సమావేశాలు సభలో జరిగే గందరగోళానికి పరాకాష్టతను చూపించింది.  చరిత్రలో ఇంతవరకూ చూడనన్ని అంతరాయాలతో సభ సాగింది.  కానీ పెద్ద మలుపు తిప్పే, మైలురాయిలా నిలిచిపోయే బిల్లులను పాస్ చెయ్యటం కూడా జరిగింది.   అవి తెలంగాణా, లోక్ పాల్, భూసంస్కరణ, ఆహార భద్రతా బిల్లులు.  మనం ఇప్పుడు కొన్ని తీపి కొన్ని చేదు జ్ఞాపకలతో శలవుతీసుకుంటున్నాం.

తన దైన హాస్యంతో ఆమె ఇంకా ఇలా నాయకులను ప్రశంసించారు-  కమలనాథ్ రాజకీయపుటెత్తులను ప్రయోగించారు.  సుశీల్ కుమార్ షిండే తన రాజకీయ చతురతను ఉపయోగించి సమస్యలను పరిష్కరించారు.  ప్రధాన మంత్రి పెద్ద మనిషి తరహాలో వ్యవహరించారు.  సోనియా గాంధీ చక్కటి సార్ధధ్యం వహించారు.  స్పీకర్ సహనాన్ని ప్రదర్శించారు, ఒక సీనియర్ భాజపా నాయకుడు సభా మర్యాదలను కాపాడుతూ హుందాగా ప్రవర్తించారు. 

షిండే కూడా దీటుగా ఆమెకు ఇలా సమాధానమిచ్చారు.  తెలంగాణా బిల్లును ఆమోదింపజేయటంలో భాజపా సహకారం ప్రశంసనీయం.  ఒక్కోసారి సుష్మా కోపం చూస్తే ఆమె ఇక జీవితంలో నాతో మాట్లాడదేమో అనిపిస్తుంది.  కానీ ఆమె వెళ్ళిపోయేముందు మాట్లాడే మాటలు నాకు తీపి పదార్థాలు తిన్నంత హాయినిస్తున్నాయి అన్నారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles