Sachin rekha spend zero paisa from their mplad fund

Sachin Tendulkar, cinema legend Rekha, Rajya Sabha, Sachin and Rekha, MPLAD fund, adopted Mumbai Suburban.

Sachin- Rekha spend zero paisa from their MPLAD fund

సచిన్-రేఖలు ఇంక మొదలుపెట్టలేదట?

Posted: 02/24/2014 07:09 PM IST
Sachin rekha spend zero paisa from their mplad fund

భారతరత్న , క్రికెట్  ఆణిముత్యం అయిన  సచిన్ టెండూల్కర్  రాజ్యసభకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.  సచిన్ టెండూల్కర్  క్రికెట్ అభిమానులకు దేవుడు.  అలాంటి దేవుడు  ఇప్పుడు  విమర్శలను ఎదుర్కొంటున్నారు.   సచిన్ విశిష్ట  సేవలందించిన వ్యక్తిగా గుర్తించి  రాజ్యసభలో స్థానం  కల్పించటం జరిగింది.  ప్రజలకు  సేవా చేస్తాడనే  ఉద్దేశంతో  రాజ్యసభ్యునిగా తీసుకోవటం జరిగింది. 

కానీ సచిన్  రాజ్య సభకు వచ్చి రెండు సంవత్సరాలైన, తమ ప్రాంత ప్రజలకు  ఇంతవరకు ఏమీ చేయలేదు.  అంతేకాకకుండా ఎంపీ లాడ్స్ నుంచి పైసా కూడా ఖర్చు చేయకపోవటం అందర్ని ఆశ్చర్యపరుస్తుంది.  ఏదో  మొక్కుబడిగా   సమావేశాలకు  వచ్చిపోతున్నారు తప్ప ,   వారికి కేటాయించిన ఎంపీ  నిధులను ప్రజలకు ఖర్చు చేయకపోవటంతో  ప్రతిపక్ష నాయకులు   మండిపడుతున్నారు. 

ఇదే బాటలో  బాలీవుడ్  అందాల తార  రేఖ కూడా తన ఎంపీ లాడ్స్ నుంచి పైసా  ఖర్చు  చేయలేదని అంటున్నారు. రాజ్యసభ సభ్యులకు ఓ అవకాశం ఉంటుంది. వారు ఏదైనా జిల్లాను దత్తత తీసుకుని దానిని అభివృద్ధి చేయవచ్చు.

ఈ పథకంలో భాగంగా సచిన్ ముంబయి సబర్బన్ ఏరియాను దత్తత తీసుకోగా, రేఖ ఏ ప్రాంతాన్నీ తీసుకోలేదు. ప్రతి ఎంపీకి ఎంపీలాడ్ (మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్ మెంట్) పథకం ద్వారా ఏటా రూ. 5 కోట్లు ఇస్తారు. ఆ లెక్కన వీరిద్దరి వద్ద చెరో పది కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. 

తమ రెండేళ్ళకాలంలో ఒక్క పని చేసినట్టు నివేదికలను పంపింది లేదు. పార్లమెంటు రికార్డులు చెబుతున్న వాస్తవాలివి. మరిప్పటికైనా సచిన్, రేఖ ప్రజాహితం కోరి నిధులను పథకాలకు వెచ్చిస్తారో, లేక పూర్తికాలం నిధులను నిల్వచేస్తారో కాలమే చెప్పాలి.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles