Anti congress media will be crushed says shinde

Anti congress media will be crushed says Shinde, Home Minister Sushil Kumar Shinde, Editors Guild, AAP, Former Army Chief V K Singh

Anti congress media will be crushed says Shinde

కాంగ్రెస్ కి వ్యతిరేక టివి ఛానెల్స్ ని కాలరాస్తాం- షిండే

Posted: 02/25/2014 08:38 AM IST
Anti congress media will be crushed says shinde

మీడియా మీద రాజకీయనాయకులకు గుర్రు ఎప్పుడూ ఉండేదే.  అనని మాటలను అన్నారని, అన్న మాటలను వక్రీకరించారని, చెప్పిన మాటలను పూర్తిగా కవర్ చెయ్యలేదని, ఇలా మీడియా మీద మండిపడటం సహజమే.  అయితే దానికోసం జాగ్రత్తగా ఉండాలని కోరుకునేవారే ఎక్కువమంది.  అడపాతడపా ఏమైనా అన్నా మీడియా సృష్టే కానీ వాస్తవం కాదు అన్న మాటలు వినిపిస్తుంటాయి. 

అయితే సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మాత్రం షోలాపూర్ లో మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ మీడియా మీద కాలుదువ్వారు.  కాంగ్రెస్ పార్టీ మీద కొన్ని ఛానెల్స్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, అటువంటి వాటిని కాలుకింద వేసి అణిచివేస్తాం (క్రష్ చేస్తాం) అని ఆయన అన్నారు. 

షిండే మహారాష్ట్ర లోని షోలాపూర్ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు.  అక్కడ యూత్ కాంగ్రెస్ సభ్యులను సంబోధిస్తూ చేసిన ప్రసంగంలో, నాలుగైదు నెలలుగా తాను గమనిస్తున్నానని, తన మీద కావాలనే దుష్ప్రచారాలు చేసే టివి ఛానెల్స్ ని తాను గమనిస్తూనే వున్నానని, మమ్మల్ని (కాంగ్రెస్ పార్టీని) రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, అటువంటి వాటిని కాలరాస్తామని ఆయన హెచ్చరించారు.   

నాకింద నిఘా సంస్థ పనిచేస్తోంది.  ఎప్పటికప్పడు మాకు నివేదికలనిస్తుంటుంది.  మా వెనక గోతులు తీసే వ్యతిరేక శక్తులు ఎవరో మాకు తెలుసు అంటూ షిండే ఆ ఛానెల్స్ కి చేతావని చేసారు. 

షిండే ఆ విధంగా మీడియా మీద విరుచుకుపడటానికి కారణం ఈ మధ్య కొన్ని టివి ఛానెల్స్ చేసిన అభిప్రాయ సేకరణలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభంజనం సృష్టిస్తున్న భారతీయ జనతా పార్టీకి మద్దతుగానూ, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్ లను ప్రకటించటమే. 

అయితే, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మీడియా మీద ఆఆపా, మాజీ ఆర్మీ ఛీఫ్ జనరల్ వి.కె.సింగ్ ల వ్యాఖ్యానాల దృష్ట్యా రాజకీయ నాయకులను, సమాజంలోన పేరు ప్రఖ్యాతలున్న పెద్దలను ఉద్దేశిస్తూ, సూటిగా చెప్పకుండా, నిరాధారమైన వ్యాఖ్యలతో మీడియాను ఖండించటం కానీ, ప్రశ్నించటం కానీ, విమర్శించటం కానీ చెయ్యకుండా కేవలం తమ ప్రసంగాలలోని అంశాలను వారి వారి హద్దులలోనే ఉండేట్టుగా చూసుకోమని ప్రకటించింది.

ఆవేశంతో మాట్లాడటం తర్వాత నాలిక కరుచుకుంటూ సమర్ధించుకునే ప్రయత్నం చెయ్యటం అలవాటే కనుక ఆదివారం షిండే షోలాపూర్ లో తను మాట్లాడిన మాటలకు వచ్చిన ఘాటైన స్పందన చూసి, అబ్బే నేను జర్నలిజం గురించి మాట్లాడలేదు, కేవలం సోషల్ మీడియా గురించి మాత్రమే మాట్లాడానంతే అన్నారు షిండే ఈ రోజు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles