సమైక్య వాది అయిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు సమైక్యంద్ర స్టూడెంట్స్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉగ్రరూపం చూపించారు. కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ , చంద్రబాబు లపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.
* ఇప్పుడు విద్యార్థుల సత్తా చాటే సమయం వచ్చిందని ఆయన సీమాంధ్ర విద్యార్థులనుద్దేశించి అన్నారు.
* సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. దొడ్డిదారిన రాష్ట్ర విభజన చేశారని కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
* రాష్ట్ర విభజనపై నా పోరాటం ఆగదు, జగన్, కేసీఆర్‌ను నమ్మే కాంగ్రెస్ ముందుకు వెళ్లిందని ఆయన అన్నారు.
* రాష్ట్ర విభజనపై తన పోరాటం ఆగదని, త్వరలో సుప్రీం కోర్టుకు వెళతానని కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు
* యువత వెంట ఉంటే పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.
* కాంగ్రెస్ పెద్దలు తెలుగు వారిని అవమానించారని కిరణ్ అన్నారు.
* చదువు, ఉద్యోగం ఇలా అన్ని అంశాలు ఇప్పుడు ప్రశ్నార్థకమయ్యాయని ఆయన అన్నారు.
* కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఆంధ్రప్రదేశ్ కోసం తాను రాజీనామా చేశానని కిరణ్ అన్నారు.
* భవిష్యత్తు విద్యార్థుల చేతిలోనే ఉందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
* విద్యార్థి దశలోనే అనేక ప్రశ్నలు తలెత్తుతాయని ఆయన అన్నారు.
* తెలుగువారిని అవమానిస్తే మౌనంగా ఉండాలా? మన రాజధానిని తీసుకుని వెళ్ళిపొమ్మంటే పోవాలా? అని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.
* సీమాంధ్రలు సంక్రాంతికి వెళితే... హైదరాబాద్ ఎడారిలా మారిందని... విభజన అనంతరం అదే పరిస్థితి ఉంటుందని కిరణ్ జోష్యం చెప్పారు.
* చంద్రబాబు గుడ్డిగా లేఖ రాయటం వలనే..రాష్ట్ర విభజన జరిగిందని కిరణ్ అన్నారు.
* వైఎస్ జగన్ బెయిల్ విషయంలో కాంగ్రెస్ సహాయం చేసిందని, అందుకే జగన్ కు రాష్ట్ర విభజనకు సహకరించారని కిరణ్ అన్నారు.
* సీమాంద్ర ప్రజలను చంద్రబాబు, వైఎస్ జగన్ మోసం చేసారని అన్నారు.
* కాంగ్రెస్ బీఫారం అక్కరలేదని, సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
* పార్లమెంటులో దొంగచాటుగా తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
* తెలుగు జాతి మధ్య చిచ్చుపెట్టి ఒకర్నొకరు కొటుకునేటట్లు కేంద్ర ప్రభుత్వం చేయడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
* తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు అన్యాయం జరిగిందనే తాను పార్టీని, ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నానని విద్యార్ధులకు కిరణ్ స్పష్టం చేశారు.
* తన రాజీనామాను ఇప్పటివరకు అంగీకరించలేదని, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగమని కేంద్రం నాపై ఒత్తిడి తెస్తుందని ఆయన తెలిపారు.
* గవర్నర్‌కు రెండో లేఖ కూడా రాశానని, సీఎం పదవిలో కొనసాగలేనని, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని చెప్పినట్లు కిరణ్ పేర్కొన్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more